రెట్టింపు అవుతున్న డాట్సన్ రెడి గో ఉత్పత్తి మరియు అమ్మకాలు
డాట్సన్ ఇండియా దీపావళికి గాను మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్‌గా రెడి గో స్పోర్ట్ కార్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే కేవలం ఒక నెల కాలంలోనే అన్ని కార్లు అమ్ముడుపోయాయి.
డాట్సన్ ఇండియా తమ లిమిటెడ్ ఎడిషన్ రెడి గో స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఊహించని స్థాయిలో డిమాండ్ పెరగడంతో డిమాండ్ తగ్గ ఉత్పత్తి లేక రెడి గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ప్రొడక్షన్‌ను పెంచుతున్నట్లు డాట్సన్ ప్రకటన విడుదల చేసింది.

డాట్సన్ ఇండియా మరో 800 యూనిట్ల రెడి గో స్పోర్ట్ కార్లను ఉత్పత్తి చేస్తే డిమాండ్‌కు సరిపోతుందని తెలిపింది. ఇప్పుడు బుక్ చేసుకున్న వారందరికీ నవంబర్ 2016 లోపు డెలివరీ చేయనున్నారు.

డాట్సన్ ఇండియా ఈ రెడి గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను అత్యంత ఆకర్షణీయమైన ధర రూ. 3,46,479 లతో ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా అందుబాటులో ఉంచింది.

నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్గోత్రా మాట్లాడుతూ, మేము ముందుగా ఊహించిన దానికంటే రెడి గో స్పోర్ట్ వెర్షన్ భారీ డిమాండ్‌ను మూడగట్టుకుంది. 1,000 యూనిట్ల రెడి గో స్పోర్ట్ వేరియంట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకుంటే అంచనాలను తారుమారు చేస్తూ కేవలం ఒక్క నెల కాలంలో అమ్ముడుపోయాయని తెలిపారు.

ఇండియన్ మార్కెట్లో యువత ఏ స్థాయిలో రెడి గో ను ఎంచుకుంటున్నారు అనే ప్రశ్నకు ఈ రెడి గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ అమ్మకాలే సమాధానం అని మల్హోత్రా అభిప్రాయం వ్యక్తం చేసారు.

దేశ వ్యాప్తంగా కస్టమర్లు రెడి గో కు నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో రెడి గో స్పోర్ట్ ఉత్పత్తిని పెంచి వినియోగదారులకు సకాలంలో డెలివరీ ఇవ్వనున్నట్లు చెప్పపుకొచ్చారు.

డాట్సన్ వారి బడ్జెట్ ఫ్రెండ్లీ కారు తొమ్మిది ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది మరియు రెడి గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ మీద ఎరుపు రంగులో నల్లటి స్ట్రిప్స్ వచ్చేలా స్పోర్ట్ ఎడిషన్‌కు సూచికగా డిజైన్ చేశారు.

ఎరుపు రంగు థీమ్ లో ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఎరుపు రంగు థీమ్‌లో ఉన్న వీల్ కవర్లు, స్పోర్టివ్ గ్రాఫిక్స్, స్పోర్టివ్ రూఫ్ స్పాయిలర్ మరియు బాహ్య భాగం పూర్తిగా స్పోర్టివ్ రూపాన్ని సంతరించుకుంది.

రెడి గో స్పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో స్పోర్టివ్ డ్యాష్ బోర్డ్, బ్లూ టూత్ ఆధారిత ఆడియో సిస్టమ్, మరియు ఇంటీరియర్‌లోని అన్ని ప్రధాన భాగాలను నల్లటి రంగుల్లో తీర్చిదిద్దారు.

డాట్సన్ రెడి గో స్పోర్ట్ మోడల్ సాధారణ రెడి గో లోని టాప్ ఎండ్ వేరియంట్‌లో మాత్రమే పరిచయం అయ్యింది. ఇది రబ్బీ, వైట్ మరియు గ్రే అనే మూడు ఆకర్షణీయమైన బాడీ రంగుల్లో లభించును.

ప్రస్తుతం రెడి గో మరియు రెడి గో స్పోర్ట్ ఎడిషన్ ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ఉన్న 227 డాట్సన్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి.

డాట్సన్ రెడి గో ఎంట్రీలెవల్ హ్యాచ్‌బ్యాక్ 799సీసీ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

ఇందులోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ సుమారుగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలగి ఉన్న ఈ రెడి గో లీటర్‌కు 25.17 కిలోమీటర్లు ఇవ్వగలదు (డాట్సన్ వారి ప్రకారం).

- రాయల్ ఎన్ఫీల్డ్ కొంపముంచే నిర్ణయం తీసుకున్న మహీంద్రా
- ఈ కొత్త కారుతో మార్కెట్‌ను కుదిపేయడం ఖాయం అంటున్న మారుతి
- ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిరిండియా నాన్ స్టాప్ విమానం: ప్రపంచంలో అత్యంత పొడవైన విమాన సర్వీస్


Click it and Unblock the Notifications








