గ్రాండ్‌గా డాట్సన్ రెడి గో ను ప్రపంచానికి పరిచయం చేసిన డాట్సన్
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ డాట్సన్ నేడు ఢిల్లీలో తమ రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను అవిష్కరిచింది. అధికారికంగా అంతర్జాతీయంగా పరిచయం చేసిన ఈ రెడి గో హ్యాచ్‌బ్యాక్‌ను డాట్సన్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. రెడి గో కారు గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.
దీనిని కూడా చదవండి: నాగసాకి, హిరోషిమా నగరాల మీద బాంబుల వర్షం కురిపించిన చారిత్రక విమానం గురించి

డాట్సన్ రెడి గో లో 800 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు, ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.

2014 లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద డాట్సన్ ప్రదర్శించిన రెడి గో కాన్సెప్ట్ డిజైన్‌కు ఏ మాత్రం తీసిపోలేదు ఈ నూతన రెడి గో కారు డిజైన్

ముఖ్యంగా దీనిని 25 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

డాట్సన్ వారు ఈ రెడి గో హ్యాచ్‌బ్యాక్ కారుకు ముందు వైపున అందించిన స్టైలింగ్‌తో కూడిన హెడ్‌లైట్లను, బంపర్‌ను అనుసరిస్తూ అందమైన పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు మరియు ఆంగ్లపు డి ఆకారంలో గళ్లు గళ్లుగా ఉన్న సరికొత్త ఫ్రంట్ గ్రిల్ మరింత ఆకర్షణీయంగా ఉంది.

ప్రక్కవైపుల సాధారణంగానే డిజైన్ చేయబడి ఉంది, అయితే వెనుక వైపున పై నుండి క్రింద వరకు కొంచెం వాలుతో రెస్ట్ తీసుకోవడానికి అన్నట్లుగా డిజైన్ చేశారు, కారు బాడీతో పాటుగా టెయిల్ లైట్లను కూడా ఆ డిజైన్‌లో ఇముడింప చేశారు.

ఇంటీరియర్ పరంగా చూస్తే డాట్సన్ వారి ఇంటీరియర్ డిజైన్ శైలికి అద్దం పట్టే విధంగా ఎంతో అందంగా డిజైన్ చేశారు. మరియు ఇందులోని యాంగులర్ ఇంస్ట్రుమెంట్ కంట్రోల్ చాలా కూల్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా దీని ద్వారా ఎయిర్ కండీషనింగ్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లకు చెందిన వాటిని నియంత్రించవచ్చు.

ఇంటీరియర్ పరంగా డాట్సన్ వారు ఈ శ్రేణిలో ఉత్తమ ఇంటీరియర్ స్పేస్‌ను కల్పించింది,అంతే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా ఎక్కువగా 185 ఎమ్ఎమ్ వరకు కల్పించినట్లు తెలిపారు.

డాట్సన్ వారి రెడి గో కారుకు చెందిన బుకింగ్స్‌ను ప్రస్తుతం స్వీకరిస్తున్నారు మరియు వీటిని వచ్చే జూన్ నుండి డెలివరీ ఇవ్వనున్నారు.

గో హ్యాచ్‌బ్యాక్ మరియు గో ప్లస్ ఎమ్‌పివి తరువాత ఇండియన్ రోడ్ల మీద పరుగుల పెట్టనున్న ఈ రెడి గో కారు డాట్సన్ వారి మూడవ ఉత్పత్తిగా ఉంది.

వెనుక వైపున డాట్సన్ ఈ రెడి గో కారుకు అత్భుతమైన నూతన డిజైన్‌ను అందించారు. పై నుండి టెయిల్ లైట్ల వరకు కొంత వాలుతో డిజైన్ చేసి అలాగే కొంచెం లోపలికి వొంపును కల్పించి మరలా బాహ్య వైపుకు ఉబ్బెత్తుగా వచ్చేట్లు డిజైన్ చేశారు.

డాట్సన్ వారి మూడవ ఉత్పత్తి అయిన రెడి గో యొక్క ఫ్రంట్ గ్రిల్ డిజైన్

డాట్సన్ రెడి గో సీట్లు మరియు ముందు వైపు ఇంటీరియర్ స్పేస్‌ను చూపెట్టే చిత్రం

డాట్సన్ రెడి గో హ్యాచ్‌బ్యాక్ కారులోని ట్రాన్స్‌మిషన్ మరియు పవర్ ద్వారా నియంత్రించ గలిగే బటన్‌లు

డాట్సన్ రెడి గో లోని ఇస్ట్రుమెంట్ క్లస్టర్‌లోని స్పీడో మీటర్ సూచిక

రెడి గో హ్యాచ్‌బ్యాక్ లోని ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్

స్టీరింగ్ మరియు డ్రైవర్ సౌలభ్యతలను తెలిపే ఇతరములు

డాట్సన్ రెడి గో హ్యాచ్‌బ్యాక్ కారులోని బూట్ స్పేస్ (లగేజ్ స్పేస్)ను తెలిపే చిత్రం.

ఇక్కడ రెడి గో అని ఆంగ్లంలో ఉంది కదూ. మీరు ఎప్పుడైనా కారు డోర్ తెరిచినపుడు చిన్న గోడలా బెత్తుడు వెడల్పుతో ఒక ప్రదేశం ఉంటుంది కదా. ఆ ప్రదేశంలో డాట్సన్ వారు ఇలా అలంకరించారు.

ప్రస్తుతం ఇది ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ ఇయాన్, రెనో క్విడ్ మరియు మారుతి సుజుకి వారి ఆల్టో 800 వంటి కార్లకు పోటిగా నిలవనుంది.

రెనో డస్టర్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ప్రారంభ ధర రూ. 8.64 లక్షలు
అద్దె భారం తగ్గించుకోవడానికి పాత వ్యాన్‌ను ఇల్లుగా మార్చుకున్నాడు: ఎలాగో మీరే చూడండి
పరీక్షల కోసం రోడ్డెక్కిన షెవర్లే స్పిన్ ఎమ్‌పివి కారు


Click it and Unblock the Notifications








