గో క్రాస్ క్రాసోవర్ కారును ప్రదర్శించిన డాట్సన్ ఇండియా
డాట్సన్ ఇండియా గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ గో క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఈ గో క్రాస్ కాన్సెప్ట్ కారు తమ గో ప్లస్ ఎమ్‌పివి ఆధారంతో రూపొందించినట్లు తెలిపారు. ఆటో ఎక్స్ పో నుండి మా ప్రతినిధులు సేకరించిన ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

డాట్సన్ ఇండియా ఈ గో క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ కారును 2015 లో జరిగిన టోక్యో మోటార్ షోలో దీనిని ప్రదర్శించారు. అయితే గత వారంలో ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ కారు షార్ప్ యాంగిల్ గల హెడ్ లైట్లను మరియు గుండ్రటి ఆకారంలో గల పగటి పూట వెలిగే లైట్లను కలిగి ఉంది. వీటితో పాటు గ్రే మరియు సిల్వర్ రంగులో గల స్కిడ్ ప్లేట్లను కల్పించారు.
Also Read: సచిన్ టెండూల్కర్ దివ్య హస్తాలతో
దీనిని ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గల యువతను దృష్టిలో ఉంచుకుని వారికి తగ్గట్టుగా ఈ నూతన తరం గో క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్‌ను రూపొందించామని డాట్సన్ ఇండియా ఎక్జ్సిక్యూటివ్ డిజైన్ డైరెక్టర్ ఈ సందర్భంగా తెలిపాడు.
Also Read: యువత కోసం మరొక బెస్ట్ టూవీలర్: బెనెల్లీ టొరాండో 302
ప్రస్తుతం ప్రదర్శించిన ఈ కాన్సెప్ట్ కారును ఈ ఏడాది చివరికల్లా ప్రొడక్షన్‌కు సిద్దం చేయనున్నారు. అయితే వచ్చే ఏడాది ప్రారంభానికి దీనిని దేశ వ్యాప్తంగా అమ్మకాలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications




























