పెద్ద నోట్ల రద్దు వాహన పరిశ్రమ మీద ప్రభావం ఇలా...
రూ. 500, రూ. 1,000 నోట్ల చెలామణి రద్దు కారణంతో దేశవ్యాప్తంగా టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం.
దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన రూ. 500 మరియు రూ. 1,000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాలు విమర్శలు గుప్పిస్తుంటే మరికొన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పెద్ద నోట్ల రద్దు అనే అంశం సామాన్య ప్రజలను బాగా కుదిపేసింది. అయితే ఇప్పుడు రద్దు అంశం భారత వాహన తయారీ పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.

పెద్ద నోట్ల రద్దు కారణంతో టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్లతో పాటు ఆటో విడిబాగాల పరిశ్రమల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని కారణంగా దేశీయంగా ఉన్న వివిధ వాహన తయారీ సంస్థలు కాస్త భయాందోళనలో ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ చేతి ద్వారా డబ్బును చెల్లించి కొనుగోళ్లు జరుపుతున్నారు. చాలా వరకు టూ వీలర్లు మరియు ఫోర్ వీలర్ల కొనుగోలుదార్లు స్వయానా డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ప్రధాని సందేశం ప్రకారం పెద్ద నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో అమ్మకాలు కాస్త మందగమనం పట్టాయి. అన్నీ సర్దుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది.

చాలా వరకు కొనుగోలుదారులు టూ వీలర్ల మరియు ఫోర్ వీలర్ల బుకింగ్స్ మరియు డౌన్ పేమెంట్ క్రింద చేతి ద్వారా డబ్బు చెల్లిస్తున్నారు. మొత్తం మీద ఆటో వాహన పరిశ్రమ మీద దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. నగదు రహిత ఆన్ లైన్ చెల్లింపులకు గ్రామీణులు ఇప్పటీ దూరంగానే ఉండటం ఒక ప్రధాన సమస్యగా చెప్పచ్చు.

ప్రస్తుతం ఫోర్ వీలర్ల విక్రయదారులు పెద్ద వాహనాలను కొనుగోలు చేయడానికి సుముఖత చూపే వినియోగదారుల నుండి పాన్ కార్డ్ ను డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ టూ వీలర్ల అమ్మకాలకు ఈ నిర్ణయం నుండి మినహాయింపు ఉంది. పూర్తి స్థాయిలో నగదు చెల్లింపుతో జరిగే విక్రయాలు దాదాపుగా ఆగిపోయాయి. నగదు రహిత చెల్లింపులకు డీలర్లు సుముఖతతో ఉన్నారు.

- పాకిస్తాన్ కు బుజ్జగింపు చర్యలుండవు: ఇక ప్రతిదాడులే...!!
- ఈ దారులు వెంబడి వెళితే వెనక్కి రావడం అసాధ్యం
- 55 ఏళ్ల నిర్విరామ సేవలందించిన INS విరాట్ ఆంధ్రప్రదేశ్ చెంతకు


Click it and Unblock the Notifications








