సుప్రీమ్ కోర్టు నిర్ణయానికి 5,000 మంది ఉద్యోగుల కోత
సుప్రీమ్ కోర్టు ఢిల్లీ మరియు రాజధాని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా పైబడి సామర్థ్యం ఉన్న వాహనాల అమ్మకాలను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ నిషేధం కొనసాగుతూ ఉంది. అయితే సుప్రీమ్ కోర్టు డీజల్ వాహనాల మీద నిషేధం విధించినప్పటి నుండి సుమారుగా 5,000 మంది ఉద్యగస్థులపై వేటు పడినట్లు తెలిసింది.

భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘ (ఎస్‌ఐఏఎమ్) ప్రకారం సుప్రీమ్ కోర్టు నిషేధం విధించినప్పటి నుండి సుమారుగా 11,000 యూనిట్ల వాహనాల ఉత్పత్తి నిలిచిపోయింది. తద్వారా ప్రత్యక్షంగా ఉత్పత్తి ప్లాంట్లలో పనిచేసే సుమారుగా 5,000 మంది వరకు ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చినట్లు తెలిపారు.
Also Read: కార్ల కోసం భవిష్యత్తులో రానున్న పది టెక్నాలజీలు
ఒక వేల ఢిల్లీలో విధించిన ఈ నిషేధం దేశ వ్యాప్తంగా అమలుపరిస్తే కొన్ని నెలల కాలంలోనే సుమారుగా లక్షకు పైగా వాహనాల అమ్మకాలు ఆగిపోయి దాదాపుగా 47,000 మంది వరకు ఉపాధిని కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఆ విషయం పరంగా రెనో క్విడ్ మంచిది కాదా....!!
ప్రస్తుతం ఢిల్లీ మరియు దాజధాని పరిధి ప్రాంతంలో ఉన్న డీలర్లు తమ వద్ద ఉన్న 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలను నిషేధం లేని ప్రాంతాలకు తరలించి అమ్మేస్తున్నారు. నిషేధం కొనసాగుతూ ఉండటం వలన చాలా వరకు డీలర్ల కూడా ఈ కార్లను తమ వద్ద ఉంచుకుని నష్టపోతున్నట్లు తెలిసింది.
Also Read: ప్రపంచపు అతి పెద్ద విమానం, ఉక్రెయిన్ నుండి ఆస్ట్రేలియాకు చారిత్రక ప్రయాణం
సుప్రీమ్ కోర్టు డిసెంబర్ 16, 2015 నుండి 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల అమ్మకాలను ఢిల్లీ మరియు రాజధాని పరిధిలో నిషేదించిన సంగతి ఇది వరకు విధితమే, అయితే సుప్రీమ్ కోర్టు అప్పట్లో ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు ఈ నిషేధం కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే అతి త్వరలో మరో సారి ఈ నిషేదాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనుంది.


Click it and Unblock the Notifications








