కార్లు మరియు బైకుల మీద దిమ్మతిరిగే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు
పండుగ సీజన్ ప్రజల జీవితాల్లోనే కాదు, కార్లు మరియు బైకుల తయారీ సంస్థల్లో కూడా వెలుగును నింపుతోంది. కార్లు మరియు భైకుల సంస్థలు భారీ స్థాయిలో విక్రయాలు చేపట్టేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.
కేవలం వారం రోజులు తేడాతో వచ్చిన దసర మరియు దీపావళి పండుగలు ఇటు ప్రజలకు అటు సంస్థలకు మంచి వాతావారణాన్ని క్రియేట్ చేసింది. కొత్తగా ఇంటికి వాహనం కొనుగోలు చేసే వారికి పండుగ సీజన్ సందర్భంగా కార్లు మరియు బైకుల తయారీ సంస్థలు భారీ స్థాయిలో ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించాయి. రాబోయే రెండు రోజుల్లో జరిగే విక్రయాల మీద భారీ అంచానాలే ఉన్నాయి.

మారుతి సుజుకి
భారత దేశపు అతి పెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏడాది పండుగ సీజన్ కోసం తమ శ్రేణిలో ఉన్న ఎంచుకోదగ్గ ఉత్పత్తుల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్, సియాజ్, ఎర్టిగా మరియు ఎస్-క్రాస్ వంటి ఉత్పత్తుల మీద ఎక్స్‌చ్ఛేంజ్ ఆఫర్లను అందించింది.

మారుతి వారి ఆఫర్ల క్యాష్ డిస్కౌంట్ క్రింద 45,000 రుపాయలు మరియు ఎక్స్‌చ్చేంజ్ బోనస్ రూపంలో 50,000 రుపాయలను అందించనుంది. అయితే బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులయిన బాలెనొ, వితారా బ్రిజా వంటి మీద ఏవిధమైన ఆఫర్లు లేవు.

హ్యుందాయ్ మోటార్స్
భారత దేశపు రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా మీద మినహాయించి మిహతా అన్ని ఉత్పత్తుల మీద దీపావళి ఆఫర్లు మరియు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఇయాన్ మీద 62,000 రుపాయల వరకు లాభాలను ప్రకటించింది హ్యుందాయ్.

హ్యుందాయ్ లోని గ్రాండ్ ఐ10 మీద 91,000 రుపాయలు మరియు శాంటాఫె మీద 1.50 లక్షల వరకు లాభాలను అందిస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో టర్మ్స్ అండ్ కండీషన్స్ కోసం సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించగలరు.

రెనో
రెనో ఇండియా దేశీయంగా అందుబాటులో ఉంచిన తమ డస్టర్ మీద కొన్ని ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. రెనో డస్టర్ ఎస్‌యువి గట్టి పోటీని ఎదుర్కుంటోంది.

ఫ్రెంచ్‌కు చెందిన రెనో తమ డస్టర్ ఆటోమేటిక్ వేరియంట్ మీద 40,000 రుపాయల వరకు తగ్పింపును ప్రకటించింది.

హోండా మోటార్స్
హోండా మోటార్స్ అందుబాటులో ఉంచిన 7-సీటర్ మొబీలియో మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో 7-సీటర్ ఎమ్‌పివిని ఎంచుకునే వారికి పెట్రోల్ మరియు డీజల్ మొబీలియో రెండు వేరియంట్ల మీద ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

2015 మోడల్‌కు చెందిన డీజల్ మొబీలియో మీద రెండు లక్షల రుపాయలు మరియు పెట్రోల్ మొబీలియో మీద 1.20 లక్షలు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

ఫోర్డ్
ఫోర్డ్ తమ శక్తివంతమైన ఎండీవర్ ఎస్‌యువి మీద దీపావళి సందర్భంగా ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది. ఎండీవర్‌లోని 2.2-లీటర్ ఇంజన్ మ్యాన్యువల్ వేరియంట్ ను కేవలం 23.78 లక్షలు ప్రారంభ ధరతో మరియు ఫోర్ వీల్ డ్రైవ్ వేరింయంట్‌ను 25.50 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీతో అందుబాటులో ఉంచింది.

ఫోర్డ్ ఎండీవర్ లోని 3.2-లీటర్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ 1.72 లక్షలు తక్కువ ధరతో 25.93 లక్షలతో అందుబాటులో ఉంది.

వోక్స్‌వ్యాగన్
వోక్స్‌ఫెస్ట్ పేరుతో మాసం మొత్తం పండుగ సంభరాలను జరుపుకుంటోంది వోక్స్‌వ్యాగన్. పోలో, వెంటో మరియు జెట్టా ఉత్పత్తుల మీద ఆకర్షణీయమైన బుణ సదుపాయం కల్పిస్తోంది.

వోక్స్‌వ్యాగన్ తమ పోలో మరియు వెంటో ఉత్పత్తులను వడ్డీ రహిత బుణాన్ని మూడేళ్లకు కల్పిస్తోంది. లేదంటే 35,000 రుపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. మరియు తమ జెట్టా మోడల్‌ను 4.99శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంచింది.

హీరో మోటోకార్ప్
భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ శ్రేణిలో ఉన్న బైకులు మరియు స్కూటర్లను తక్కువ నెలసరి వాయిదాలతో అందుబాటులో ఉంచింది.

హీరో శ్రేణిలో ఉన్న మాయెస్ట్రో ఎడ్జ్, డ్యూయెట్ మరియు ప్లెజర్ లను వడ్డీ రహిత బుణంతో మరియు మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. తమ అన్ని ఉత్పత్తుల మీద ఐదేళ్ల వారంటీని ఇచ్చారు.

టీవీఎస్
టీవీఎస్ తమ అన్ని ఉత్పత్తులను 3.99 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్స్ సదుపాయం కల్పిస్తోంది. మరియు ఉచిత 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రొగ్రామ్‌ను కూడా ప్రారంభించింది టీవీఎస్.

- ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యన్ మిస్సైల్స్ ఇప్పడు భారత్ వద్ద
- పాక్‌ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు
- మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ


Click it and Unblock the Notifications








