మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ యానివర్సిరీ ఎడిషన్‌ను విడుదల చేసిన డుకాటి
ప్రముఖ స్పోర్ట్స్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి తమ 90 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త స్పెషల్ ఎడిషన్ బైకును విడుదల చేసింది. హిల్ క్లైంబ్ ఈవెంట్ వద్ద మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రదర్శించారు. దీనికి సంభందించిన పూర్తి వివరాలు....

డుకాటి మల్టీస్రాడా 1200 పైక్స్ పీక్ యానివర్సిరీ ఎడిషన్‌లో 1198.4సీసీ సామర్థ్యం ఉన్న ఎల్-ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 160బిహెచ్‌పి పవర్ మరియు 136ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లైట్ యాక్షన్ హైడ్రాలిక్ క్లచ్ అనుంసంధానంతో ఉన్న 6-స్పీడ్ గేర్‍బాక్స్‌ను అందించారు.

ఈ స్పెషల్ ఎడిషన్‌లో డుకాటి కార్నరింగ్ లైట్లు, డుకాటి సేఫ్టీ ప్యాక్, డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ మరియు డుకాటి వీలి కంట్రోల్ కలవు.

ఈ మల్టీస్ట్రాడా 1200 పైక్స్ పీక్ బైకులో క్రూయిజ్ కంట్రోల్, రైడింగ్ మోడ్, హ్యాండ్స్ ఫ్రీ ఇగ్నిషన్ మరియు బాష్ సంస్థ వారి 9ఎమ్ఇ మల్టీ కాలిబరేషన్ కార్నిరింగ్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్.

జివ్వున పెరిగి టీవీఎస్ ఎక్స్ఎల్ అమ్మకాలు....


Click it and Unblock the Notifications