ఇండియన్ మార్కెట్లోకి ఫెరారి 488 జిటిబి విడుదల ధర రూ. 3.88 కోట్లు
ఫెరారి భారతీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి తన 488 జిటిబి సూపర్ కారును విడుదల చేసింది. ఢిల్లీలోని తమ ఫెరారి షోరూమ్‌ను వేదికగా చేసుకుని ఈ సూపర్ కారును విడుదల చేసింది. దీని ధర రూ. 3.88 కోట్ల రుపాయలుగా ఉంది. దీని ధర అటుంచితే దీని ఫోటోలు చూడండి ఎంత హోయలుపోతోందో.

ఇంజన్ , గేర్ బాక్స్ ఇతర సాంకేతిక వివరాలు:
ఇంజన్ రకము: వి8 ట్విన్ టర్బో
ఇంజన్ కెపాసిటి: 3.9-లీటర్
పవర్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 660 బిహెచ్‌పి
టార్క్: 3,000 ఆర్‌పిఎమ్ వద్ద 760 ఎన్ఎమ్
0 నుండి 100 కిమీ వేగం: కేవలం 3 సెకండ్ల వ్యవధిలోనే
0 నుండి 200 కిమీ వేగం: కేవలం 8.3 సెకండ్ల వ్యవధిలోనే
అత్యెధిక వేగం: గంటకు 330 కిలోమీటర్లు
ఫెరారి కారు ఇంజన్ విడుదల చేసే పవర్ ఇందులోని 7-స్పీడ్ డ్యూయల్ క్లచే గేర్ బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు అందుతుంది.
Also Read: టైటానిక్-1 ఓడ గురించి మరచిపోండి ఎందుకంటే టైటానిక్-2 వస్తోంది.
శైలి:
ఫెరారి నూతనంగా భారీ ధర వద్ద విడుదల చేసిన 488 జిటిబి కారులోని కొన్ని డిజైన్‌లను ఫెరారి వారి 458 ఇటాలియా మరియు 458 స్పెషల్ కార్ల నుండి సేకరించి దీనిని డిజైన్ చేశారు. ముందు వైపున గల రెండు రేడియేటర్లుకు గాలి చేరడానికి ప్రత్యేకంగా తయారు చేసిన డ్యూయల్ ఫ్రంట్ గ్రిల్ కలదు.
Also Read: బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి ఎకో స్పోర్ట్‌కు పోటీగా నిలిచిన మారుతి సుజుకి వితారా బ్రిజా
ప్రత్యేకమైన లుక్‌తో వచ్చిన చాకు లాంటి హెడ్ లైట్లు ఫెరారి వారి డిజైన్స్‌కు అద్దం పట్టేలా ఉన్నాయి. దీనికి తోడు పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు ఎంతో చక్కటి రూపాన్ని తీసుకువచ్చాయి. సాదారణంగా గాలి ముందు వైపు నుండి మాత్రమే ఇంజన్ వైపుకు ప్రవహిస్తుంది, కాని ఫెరారి తమ అత్భుతమైన డిజైన్‌తో ప్రక్క వైపుల నుండి కూడా గాలి ఇంజన్ వైపుకు వీచే విధంగా రూపొందించారు.
లగ్జరీ కార్ల సంస్థలు ముందు వైపు డిజైన్‌తో పాటు వెనుకవైపున డిజైన్‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాయి. ఫెరారి తమ 488 జిటిబి కారులో ఇంటిగ్రేటెడ్ సింగల్ టెయిల్ ల్యాంప్, రియర్ డిఫ్యూసర్ మరియు రెండు పొగ గొట్టాలు కల్పించారు. అంతే కాదండోయ్ ఇంజన్ వైపుకు వీచిని గాలి వేడిగా ఉంటుంది కదా దీనిని వెనుక నుండి బయటకు నెట్టడానికి ప్రత్యేకమైన దారులను కల్పించారు.
Also Read: రెనో డస్టర్ ప్రేమికులకు శుభవార్త
అందుబాటులోకి మరియు పోటి:
ఫెరారి వారి సరికొత్త 488 జిటిబి కారు ప్రస్తుతం ముంబైయ్ మరియు ఢిల్లీ షోరూమ్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది ల్యాంబోర్గిని హురాకాన్ మరియు ఆడి ఆర్8 వి10 ప్లస్ కార్లకు పోటిగా నిలవనుంది


Click it and Unblock the Notifications






































