మొదటి తరం "ప్యూర్ " కారును మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్న ఫియట్
ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ ఫియట్ తమ మొదటి తరం కారు ప్యూర్ ను మార్కెట్లో నుండి తొలగించి చాలా కాలమే అయింది. అయితే ఫియట్ మోటార్స్ వారు ఈ కారును తిరిగి మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నారు.
Also Read: ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు ఇవేనంట...!!
2014 లో చివరి సారిగా దీనిని ఉత్పత్తి చేశారు. ఆ తరువాత వీటి అమ్మకాలను పూర్తి నిలిపివేశారు. దీనికి కారణం అప్పట్లో వీటి అమ్మకాలు భారీ స్థాయిలో క్షీణించి ఫియట్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో అమ్ముడుపోకుండా నిలిచిపోయాయి. కేవలం ఈ కారణంగా ఫియట్ అప్పట్లో వీటిని మార్కెట్ నుండి తొలగించింది.
Also Read: భారతీయ వాహన రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు
అయితే ఇప్పుడు ఆ ప్యూర్ కారును ఇంటీరియర్ మరియు ఎక్ట్సీటిరియర్ మార్పులతో మన ముందుకు తీసుకురానున్నారు.
ఈ కారులో 1.3-లీటర్ మల్టీజెట్ డీజల్ ఇంజన్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉండనుంది. ఈ రెండు ఇంజన్‌లను కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులోకి రానున్నాయి.
ఫియట్ వారి మొదటి తరం ప్యూర్ కారు మూడు రకాల వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. అవి
- ఆక్టివ్
- డైనమిక్
- ఎమోషన్
Also Read: 2015 లో టాప్-10 బెస్ట్ స్కూటర్లు



Click it and Unblock the Notifications








