భారతీయ మార్కెట్లోకి ఫియట్ పుంటో ప్యూర్ హ్యాచ్‌బ్యాక్
ఫియట్ దేశీయ మార్కెట్లోకి తమ పుంటో వేరియంట్ నుండి పుంటో ప్యూర్ అనే హ్యాచ్‌బ్యాక్ కారును గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక ద్వారా విడుదల చేసింది. వీటి ధరలు 4.49 లక్షలుగా పెట్రోల్ వేరియంట్ మరియు 5.59 లక్షలుగా డీజల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్(ఢిల్లీ) గా ఉన్నాయి. పుంటో ప్యూర్ ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

ఫియట్ పుంటో ప్యూర్ సాంకేతిక వివరాలు:
ఫియట్ వారి పుంటో ప్యూర్ కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-డీజల్ ఇంజన్. పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజల్ ఇంజన్ దాదాపుగా 75 బిహెచ్‌పి పవర్ మరియు 197 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‍బాక్స్‌ను కలిగి ఉన్నాయి.
Also Read: షెవర్లే నుండి సరికొత్త ఎసెన్షియా కాంపాక్ట్ సెడాన్
డిజైన్:
డిజైన్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుంటో మొదటి తరం కారు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది అయితే పేరును మాత్రమే మార్చారు. ఇందులో హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్‌ను కొంచెం మార్చి డిజైన్ చేశారు. దీనికి మించి ఇందులో ఎటువంటి నూతనత్వము సంతరించుకోలేదు.
Also Read: నిస్సాన్ నుండి ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్‌యువి
అందుబాటులోకి:
దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడే వారికి శుభవార్త ఎందుకంటే ఈ కారు దేశ వ్యాప్తంగా గల అన్ని ఫియట్ డీలర్ షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. మరియు ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో కార్లకు పోటిగా నిలిచింది.


Click it and Unblock the Notifications
















































