దోషాలు ఉన్నా కూడా ఉత్తమంగా అమ్ముడుపోతున్న టాప్-5 కార్లు

By Anil

కారుకొనే ముందు ఎన్నో అంశాలు పరిశీలించుకున్న తరువాతే ఫలానా కారు కొనాలని ఒక నిర్ణయానికి వస్తాము. కాని దేశ వ్యాప్తంగా అత్యధిక మంది ఎంచుకున్న ఐదు కార్లలో విపరీతమైన దోషాలు ఉన్నాయి. అయినా కూడా వాటినే ఎంచుకుంటున్నారు.

అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్న ఐదు మోడల్స్ కార్లు అందులో ఉన్న దోషాలు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మారుతి ఆల్టో

మారుతి ఆల్టో

దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడువుతున్న కార్లలో మొదటి స్థానంలో ఉంది ఆల్టో 800. సరాసరిగా నెలకు 22,000 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ఉత్తమమైన ఇంజన్ మరియు డ్రైవింగ్ చేయడానికి మంచి అనుకూలతల ఇందులో కలవు. అన్నింటికన్నా తక్కువ ధర అనే ఒక్క అంశం ప్రాతిపదికన ఎక్కువ మంది ఈ కారును ఎంచుకుంటున్నారు అని చెప్పవచ్చు.

 ఆల్టో 800 కారులోని దోషాలు

ఆల్టో 800 కారులోని దోషాలు

ఆల్టో కారును కొనాలని నిశ్చయించుకున్నవారు దీనిని చెడుగా తీసుకోకండి. దీనిని నిశ్చింతగా ఎంచుకోవచ్చు. కాని ఇందులో ముఖ్యంగా రెండు దోషాలు కలవు. మీరు దీనిని రివర్స్ పార్కింగ్ చేసే సమయంలో వెనుకవైపును గమనించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరు వెనుక వాటిని సులభంగా గమనించలేరు. మరొకటి ఇందులో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ కు కొన్ని నిబందనలను కల్పించారు.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి స్విఫ్ట్

భారతీయులు అత్యధికంగా ఎంచుకుంటన్న ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో స్విఫ్ట్ కారు ఒకటి. ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. మంచి ఇంధన సామర్థ్యం మరియు ఉత్తమ పవర్ ని ఇస్తుంది.

స్విఫ్ట్‌లో ఉన్న దోషాలు

స్విఫ్ట్‌లో ఉన్న దోషాలు

ఇందులో ఒక ముఖ్యమైన దోషం కలదు. వెనుక సీటులో ఒక దానికి మాత్రమే బ్యాక్‌రెస్ట్ ఆప్షన్ కలదు మరియు ఇందులో సీటుని 60:40 నిష్పత్తిలో మడిచినట్లయితే ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండదు.

 మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకి డిజైర్

మారుతి సుజుకిలోని డిజైర్ మరియు స్విఫ్ట్‌ కారుకు మధ్య ఎటువంటి భేదాలు లేవు. ఒక్క బాడీ విషయలో తప్ప. మారుతి సుజుకి వారి ఈ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును కూడా ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు.

 డిజైర్‌లోని దోషాలు

డిజైర్‌లోని దోషాలు

ఇందులో ఉన్న ముఖ్యమైన దోషం బూట్ స్పేస్. సాదారణంగా ఇందులో మారుతి సుజుకి వారు 316 లీటర్ల బూట్ స్పేస్ ప్రకటించారు. కాని మీకు నిజంగా 316 లీటర్ల బూట్ స్పోస్ కావాలంటే వెనుకవ వరుసలో ఉన్న సీటును ముందుకు అడ్జెస్ట్ చేసుకోవాల్సిం ఉంటుంది. మారుతి సుజుకి వారు ఇందులో బూట్ స్పేస్ కోసం రూపొందించిన డిజైన్ తప్పుగా చేశారు అని చెప్పవచ్చు.

 మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

వరుసగా నాలుగవ స్థానంలో మారుతి సుజుకి వారి కారు వ్యాగన్ ఆర్ కలదు. ఉత్తమమైన లెగ్ స్పేస్, హెడ్ స్పేస్, ఎత్తైన బాడీ మంచి పనితీరు, పోల్డింగ్ సీట్లు గల ఈ కారు 2001 నుండి ఇప్పటి వరకు మంచి ఫలితాలను నమోదు చేసుకుంటోంది.

 వ్యాగన్ ఆర్ కారులో గల దోషాలు

వ్యాగన్ ఆర్ కారులో గల దోషాలు

ఇందులో చెప్పడానికి పెద్దగా దోషాలు ఏమి లేవు. కాకపోతే ముందు వైపున ఉన్న డ్యాష్ బోర్డ్ డ్రైవర్ కన్నా కొంచెం ఎక్కువ ఎత్తులో ఉంటుంది మరియు ఇందులోని డ్యాష్ బోర్డ్‌కి, చుట్టు ప్రక్కల ఉపయోగించిన ప్లాస్టిక్ కొంచెం పాతగా కనిపిస్తుంది.

 హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ మెటార్స్ వారు అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన కార్లలో హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఒకటి. ఇందులో పవర్ ఫోల్డింగ్ మిర్రర్, పుష్ బటన్ స్టార్ట్ మరియు అల్లాయ్ వీల్స్ కలవు. ఇందులో ఉన్న 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 84 బిహెచ్‌పి పవర్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 90 పిఎస్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 దోషాలు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 దోషాలు

హ్యుందాయ్ వారి ఐజెన్ మోడల్ కారులో డిస్క్ రియర్ డిస్క్ బ్రేకులు, రియర్ ఫాగ్ ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ల్యాంప్‌లను అందించారు. కాని వీటిని ఈ ఎలైట్ ఐ20 కారులో అందివ్వలేక పోయారు. మరొకటి ఎలైట్ ఐ20 కారులో సూపర్ లైట్ స్టీరింగ్‌ను కల్పించడంలో విఫలం చెందారు.

 మీ జీవితంలో ఇలాంటి నౌకలలో ఒక్కసారైనా ప్రయాణించగలరా...?

  • మీ జీవితంలో ఇలాంటి నౌకలలో ఒక్కసారైనా ప్రయాణించగలరా...?

More from DriveSpark

Article Published On: Saturday, January 23, 2016, 17:57 [IST]
English summary
Five top-selling cars and their biggest flaws
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+