టెస్లా మోడల్ 3 కారుకు పోటిగా కొత్త కారును తెస్తున్న పోర్డ్
అంతర్జాతీయంగా హైబ్రిడ్ కార్లను అందించే వాటిలో టెస్లా తరువాతనే ఏదైనా. తాజాగా టెస్లా అంతర్జాతీయంగా మోడల్ 3 కారును ఆవిష్కరించింది. రెండేళ్ల తరువాత అందుబాటులోకి వచ్చే ఈ కారు కోసం ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో దీనిని బుక్ చేసుకున్నారు.
దీనికి సిఇవో అయిన మార్క్ ఫీల్డ్స్ తమ సంస్థ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారుగా 322 కిలోమీటర్లు పాటు ప్రయాణించే కార్లను అభివృద్ది చేస్తోంది తెలిపాడు.

ఈ తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ పూర్తి స్థాయిలో హైబ్రిడ్ కార్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతేకించి విద్యుచ్ఛక్తి మీద మాత్రమే ఆదారపడి నడిచే సి-మ్యాక్స్ 32 కిలోమీటర్లు మేర నడుస్తుంది. అదే ఇంధనంతో కలిసి పనిచేస్తే 122 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఈ పరిధని 160 కిలోమీటర్ల వరకు పెంచుతున్నారు.
Also Read: లీటర్‌కు 1099 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందట: ఎలాగో మీరే చూడండి
ఆటోమోటివ్ సమాచారం ప్రకారం ఈ కారును మోడల్ ఇ అనే పేరుతో పిలవనున్నారు. అయితే ట్రేడ్ మార్క్‌కు చేసుకున్న దరఖాస్తులో దీనిని పొందుపరచగా ఇంకా అమోదం పొందలేదు.
Also Read: బెంజ్ కార్ల కోసం వేచి ఉండడు.... ఆటో రిక్షాల్లో కూడా ప్రయాణిస్తాడు: అజీమ్ ప్రేమ్‌జీ
అంతేకుండా ఈ మోడల్ ఇ కారును సాంప్రదాయ హైబ్రిడ్, అనుసంధానించుకునే హైబ్రిడ్ మరియు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వంటి రకాలుగా దీనిని అభివృద్ది చేస్తున్నారు. కాబట్టి ఈ మోడల్ ఇ కారు టెస్లా వారి మోడల్ 3 కారును అధిగమించడానికి సిద్దం అవుతోందన్నమాట. అయితే ఇది నిజంగానే మోడల్ 3 కారును అంధిగమిస్తుందానే అనే దానికోసం వేచి ఉండాలి మరి.


Click it and Unblock the Notifications



