సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌లో ఫోర్డ్ ఎకో స్పోర్ట్: ప్రారంభ ధర రూ. 9.26 లక్షలు
ఫోర్డ్ మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్లోకి 2016 పండుగ సీజన్ వేడుకల సందర్భంగా తమ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిని ప్రత్యేక ఎడిషన్‌లో పరిచయం చేసింది. అమెరికా ఆధారిత కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఈ ప్రత్యేక ఎడిషన్ ఉత్పత్తికి ఎకోస్పోర్ట్ బ్లాక్ ఎడిషన్ సిగ్నేచర్ ఎడిషన్ అనే పేరును నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ షోరూమ్‍లలో ఈ ఎకోస్పోర్ట్ బ్లాక్ సిగ్నేచర్ ఎడిషన్ కేవలం టైటానియమ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫోర్డ్ మోటార్స్ ఎకోస్పోర్ట్ బ్లాక్ సిగ్నేచర్ ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 9.26 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఎకో స్పోర్ట్‌లో సుమారుగా 37,894 రుపాయల విలువవైన యాక్ససరీలను ఉచితంగా అందిస్తోంది.

బ్లాక్ సిగ్నేచర్ ఎడిషన్ వేరియంట్లో బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ మోల్డింగ్ మద్యలో నిర్మితమైన హెడ్ ల్యాంప్స్, బ్లాక్ మిర్రర్ కవర్స్, బ్లాక్ రూఫ్ రెయిల్, మరియు బ్లాక్ రూఫ్ క్రాస్ బార్స్ వంటివి ఎక్ట్సీరియర్‌లో ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయి.

ఇంటీరియర్‌లో ఎర్రటి దారంతో కుట్టబడిన బ్లాక్ వినైల్ సీట్ కవర్లు, మరియు ఇంటీరియర్ పూర్తి స్థాయిలో బ్లాక్ పూత పూయబడి ఉంది.

ఫాగ్ ల్యాంప్స్ క్రింది భాగంలో సరికొత్త పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లను అందించారు. అంతే కాకుండా ఇందులో ఇల్ల్యుమినేటెడ్ స్కప్ ప్లేట్లు మరియు స్పోర్టివ్ బాడీ గ్రాఫిక్స్ అందించింది.

బ్లాక్ ఎడిషన్ ఎకోస్పోర్ట్ ను సిగ్నేచర్ ఎడిషన్‌గా మార్చడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఫోర్డ్ డీలర్లు ఇందులో అదనపు ఫీచర్లను అందిస్తున్నారు.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ఫ్రంట్ గ్రిల్...

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ అల్లాయ్ వీల్స్...

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ ఎక్ట్సీరియర్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రియర్ వ్యూవ్...

- మోడీ ఎఫెక్ట్; భారతదేశ రక్షణ ఒప్పందంపై ప్రపంచ దేశాల పోటీ
- ప్రమాదకర శత్రువుల అంతానికి ఈ ఐదు ఎంతో కీలకం
- సుయాజ్ కెనాల్ గురించి ఆసక్తిరమైన సమాచారం...!!


Click it and Unblock the Notifications








