ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

By Anil

ఉత్తమ డ్రైవబులిటి మరియు అత్యంత నాణ్యతతో ఉత్పత్తుల అందించడంలో ఫోర్డ్ సంస్థ ఒకటి. ప్రతికూల రహదారులు గల ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఎకో స్పోర్ట్ ఎస్‌యువి విజయం ఒక ఉదాహరణ.

సరిగ్గా రోడ్లు లేని దేశంలోకి తక్కువ ధరతో కార్లను అందివ్వడం ఎంత ఇబ్బందో ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా తెలుసు. కాని మంచి ధరకు అత్యంత నాణ్యమైన ఎకో స్పోర్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది ఫోర్డ్. ఎంత నాణ్యమైనదయినా కొన్ని లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. క్రింది కథనం ద్వారా ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని లోటుపాట్లను తెలుసుంకుందాం...

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ప్రయోజనాలు మరియు అప్రయోజాలు

సబ్-ఫోర్ మీటర్ వాహనాలకు తక్కువ ఎక్సైజ్ డ్యూటి ఉంటుంది. తద్వారా మిగతా ఎస్‌యువిలతో పోల్చితే సబ్ నాలుగు మీటర్ల వాహనాల ధరలు తక్కువగా ఉంటాయి తద్వారా ఎక్కువ మంది ఇలాంటి ఎస్‌యువిలనే ఎంచుకుంటున్నారు.

ప్రతి కూలతలు

రెనో ఈ సెగ్మెంట్లోకి మొదటి సారిగా తమ డస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎస్‌యువి కోసం మోనోక్యూ ఛాసిస్‌ను అందించారు, అయితే దీనిని మనం ఎకో స్పోర్ట్‌లో గుర్తించలేము. అందుకే డస్టర్‌తో పోల్చుకుంటే తక్కువ క్యాబిన్‌ డిజైన్ ఉంటుంది.

ప్రతి కూలతలు

ఎకో స్పోర్ట్ ఆన్ రోడ్ మీద కనబరిచే పనితీరు ఆఫ్ రోడ్ మీద కనబరచడంలో విజయం సాధించలేకపోయింది. చిన్న చిన్న పల్లాలను అధిగమించడంలో కూడా కాస్త వెనక్కి తగ్గింది. (ఇది వినియోగదారుని దృష్టి కోణం నుండి సేకరించినది)

ప్రతి కూలతలు

ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజన్ అవార్డును కూడా గెలుపొందింది. కాని ఎస్‌యువిలంటే త్వరతగతిన శక్తిని పుంజుకునే విధంగా ఉండాలి, ఏదయితేనే డీజల్ వేరియంట్ శక్తివంతమైన ఇంజన్ కోసం ఇబ్బంది పడుతోంది.

ప్రతి కూలతలు

డ్రైవర్ సీటులో కూర్చున్నపుడు వెనుక వైపును వీక్షణాన్ని దెబ్బ తీసే విధంగా ఎ-పిల్లర్‌ను దప్పంగా డిజైన్ చేశారు. వెనుక ముగ్గురు కోర్చోవడానికి వీలున్నా ఇరుకుగానే భరించాల్సి ఉంటుంది. అయితే వెగ్ రూమ్ స్పేస్ ఆశించిన స్థాయిలో ఉంది.

ప్రతి కూలతలు

టైటానియమ్ (ఒ) వేరియంట్‌లో సేఫ్టీ కోసం ఆరు ఎయిర్ బ్యాగులు వచ్చినప్పటికీ ఇండియన్ రోడ్ల మీద నడిచే వాహనాలకు ఎంతో ముఖ్యమైన హ్యాండిల్స్‌ను అందివ్వలేకపోయారు.

ప్రతి కూలతలు

ఈ సెగ్మెంట్లోని మిగతా వాహనాలతో పోల్చినపుడు ఇందులోని బూట్ స్పేస్ అన్నింటికన్నా తక్కువగా 362-లీటర్లు మాత్రమే ఉంది.

ప్రయోజనాలు

సాలిడ్ వాహనాలకు పేరుగాంచిన తయారీ సంస్థ ఫోర్డ్. తమ ఎకో స్పోర్ట్ విషయంలో కూడా ఏ విధమైన రాజీ లేని డిజైన్‌ను అందించారు. నిర్మాణానికి సరిపోయే విధంగానే విభిన్నమైన రంగులను అందించారు.

ప్రయోజనాలు

సిటి రోడ్లకు అచ్చంగా సరిపోయే విధంగా గుంతలు, స్పీడ్ బ్రేకర్లు, సన్నని రహదారులన్నింటిని అధిగమించే విధంగా వివిధ రకాల ఫీచర్లు, డ్రైవింగ్ పొజిషన్ మరియు అధిగమించే అవకాశాలను కల్పించింది.

ప్రయోజనాలు

భద్రత పరంగా చూసుకుంటే టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ గల యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ మరియు ఎమర్జెన్సీ అసిస్ట్ ఫోన్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ వంటివి మరే ఇతర ఎస్‌యువిలలో గుర్తించని విధంగా ఉన్నాయి.

ప్రయోజనాలు

ఫీచర్ల పరంగా ఇందులో కీ లెస్ ఎంట్రీ, ఎస్‌వైఎన్‌సి, కూల్డ్ గ్లూవ్ బాక్స్, లెథర్ సీట్లు, పార్కింగ్ డిస్ల్పే వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రయోజనాలు

ఇది చూడటానికి క్రాసోవర్ రూపంలో మరియు సబ్ నాలుగు మీటర్ల వాహనంగా ఉన్నప్పటికీ డిజైన్ మరియు పనితీరు పరంగా ఎస్‌యువి అనుభూతిని ఇస్తుంది.

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సాంకేతిక వివరాలు

ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌ మూడు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 1.0-లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 123బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సాంకేతిక వివరాలు

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తుంది.

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సాంకేతిక వివరాలు

cఇక ఇందులోని డీజల్ విషయానికి వస్తే 1.5-లీటర్ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్‌తో పాటు 205ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేశారు.

తీర్పు

తీర్పు

మొదటి సారిగా కారును కొనేవారికి ఇది ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్‌యువి ఉత్తమ ఫీచర్లతో పాటు మంచి భద్రత ఫీచర్లతో నిండి ఉంది. అంతే కాకుండా మీ అభిరుచికి తగ్గట్లు ఎంచుకోదగిన విభిన్న రంగుల్లో ఇది లభిస్తుంది.

Article Published On: Friday, August 5, 2016, 13:12 [IST]
English summary
Ford Ecosport Disadvantages And Advantages
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+