ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరి
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ స్టాండర్డ్ ఎయిర్ బ్యాగులు
ఫోర్డ్ ఇండియా తమ కాంపాక్ట్ ఎస్‌యువి ఎకోస్పోర్ట్ లోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా అందించింది. ప్రారంభంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లోని ట్రెండ్ మరియు ట్రిమ్ కన్నా ఎక్కువ రేంజ్‌లో ఉన్న వేరియంట్లలో మాత్రమే డ్యూయల్ ఎయిర్ బ్యాగులను అందించేది.

ఇప్పుడు ఎకోస్పోర్ట్‌లోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా ఎయిర్ బ్యాగులు మరియు ఎకోస్పోర్ట్ లోని ట్రెండ్‌కు పైన ఉన్న వేరియంట్లలో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని తప్పనిసరిగా అందించారు.

ఎకోస్పోర్ట్ లోని టైటానియమ్ మరియు టైటానియమ్ ప్లస్ వేరియంట్లో అదనపు భద్రత కోసం సైడ్ మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులను కూడా ఉన్నాయి.

ఎకోస్పోర్ట్‌లోని బేస్ వేరియంట్లో కూడా అదనపు భద్రత ఫీచర్లను అందివ్వడం ద్వారా దీనికి ప్రత్యక్ష పోటీగా ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజాకు గట్టి పోటీని సృష్టించింది.

మారుతి సుజుకి వితారా బ్రిజాలోని అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంది. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఇతర వేరియంట్లలో ఆప్షనల్‌గా ఉన్నాయి.

ఎయిర్ బ్యాగులను అందివ్వడం మినహా ఫోర్డ్ తమ కాంపాక్ట్ ఎస్‌యువిలో ఏ విధమైన మార్పులు చేయలేదు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లోని ఇంజన్ రకాలు
- 1.5-లీటర్ సామర్థ్యం గల టిఐ-విసిటి పెట్రోల్ ఇంజన్
- 1.5-లీటర్ సామర్థ్యం గల టిడిసిఐ డీజల్ ఇంజన్
- 1-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల ఎకో బూస్ట్ ఇంజన్‌లు కలవు.
- భారీ మార్పులతో విడుదలైన సరికొత్త టయోటా ఫార్చ్యూనర్
- నెక్ట్స్ జెనరేషన్ క్రెటా 7 సీటింగ్ సామర్థ్యంతో: హ్యుందాయ్
- లీకైన 2017 బజాజ్ పల్సర్ 180 చిత్రాలు: నూతనంగా సంతరించుకున్న మార్పులేంటి ?

అన్ని వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు మరియు కేవలం 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్‌కు 6-స్పీడ్ పవర్ షిఫ్ట్ డిసిటి గేర్‌బాక్స్‌ను అదనంగా అందించారు.

ఫోర్డ్ మోటార్స్ ఈ ఎకోస్పోర్ట్ లో భారీ మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

బ్రెజిల్‌లో జరగున్న 2016 Sao Paulo Auto Show వేదిక మీద ఫేస్‌లిఫ్టెడ్ వర్షన్ ఎకోస్పోర్ట్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తోంది ఫోర్డ్. 2017 లో దీని విడుదల ఉండనుంది.



Click it and Unblock the Notifications








