పోటీని ఎదుర్కోవడానికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆపసోపాలు

Written By:

దేశీయంగా ఎకోస్పోర్ట్ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదలైన సమయంలో దీనకిదే పోటీ. అయితే గత రెండేళ్ల కాలంలో ఎస్‌యువిల సెగ్మెంట్లో నూతన ఉత్పత్తుల రావడంతో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కు ఉన్న డిమాండ్ దాదాపుగా తగ్గిపోయింది. ఒకప్పుడు భారీ విక్రయాలు సాధించే ఎకోస్పోర్ట్ ఇప్పుడు పోటీదారులను ఎదుర్కోవడంలో విఫలమవుతోందని చెప్పాలి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2017 నాటికి ఎస్‌యువి సెగ్మెంట్ మరింత బలపడుతున్న నేపథ్యంలో ఎలాగైనా విక్రయాల్లో వృద్ది సాధించేందుకు ఫోర్డ్ ఈ ఎకోస్పోర్ట్ ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఫేస్‌లిప్టెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్‌‌యువి గురించి పూర్తి వివరాలు...

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా ఎకోస్పోర్ట్ ఎస్‌యువి యొక్క ఫేస్‌లిఫ్ట్ రూపాన్ని జనవరి 2017 లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. ఫోర్డ్ మోటార్స్ ఈ ఎకోస్పోర్ట్ ను 2013 లో విపణిలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఉన్న కార్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నది ఎకోస్పోర్ట్ ఎస్‌యువి మాత్రమే. అయితే దీనికి సరాసరిగా గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న ఎకోస్పోర్ట్ అంతర్జాతీయ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. మరియు ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ఎస్‌యువి ఇప్పటికే అమెరికా విపణిలో విడుదలైంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

దేశీయంగా విడుదలయ్యే ఎకోస్పోర్ట్ మోడల్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మార్పులతో రానుంది. అయితే మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులకు గురికాలేదు.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2017 ఫేస్‌లిఫ్టెడ్ ఎకోస్పోర్ట్ లో ముఖ్యంగా రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్ క్లస్టర్, స్వల్పంగా మార్పులకు గురైన ఫ్రంట్ గ్రిల్, మరియు అధునాతన టెయిల్ లైట్లు కూడా మార్పులకు గురికానున్నాయి. మొత్తానికి అగ్రెసివ్ రూపంలో స్పోర్టివ్ లుక్‌ను సొంతం చేసుకోనుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ లో ప్రస్తుతం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ స్థానంలో ఎనిమిది అంగుళాల పరిమాణం ఇన్ఫోటైన్‌మెట్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల సింక్3 ఆపరేటింగ్ సిస్టమ్ అనుసంధానంతో రానుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా లతో పాటు బ్యాంగ్ అండ్ ఒలుఫ్‌సెన్ వారి మ్యూజిక్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో రానున్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ 100బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ అదే విధంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లతో రానుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ లోని రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానున్నాయి.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ధరలు రూ. 7 లక్షల నుండి 10 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ గా ఉండే అవకాశం ఉంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే దీనికి సరాసరి పోటీగా ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు రెనో డస్టర్ ఎస్‌యువిలకు గట్టి పోటీనివ్వనుంది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులను ప్రారంభించిన KSRTC

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ బస్సు సర్వీసుల్లోకి బయో డీజల్ బస్సులను ప్రారంభించింది. భారత దేశంలో తొలిసారిగా బయో డీజల్ బస్సులను ప్రారంభించిన తొలి రాష్ట్రం కర్ణాటకగా నిలిచింది.

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2016 లో విపణిలోకి విడుదలైన అత్యుత్తమ కార్లు

2016 ఏడాదిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన అత్యుత్త కార్లు - దేశీయ ఆటోమొబైల్ అమ్మకాల మీద అత్యంత ప్రభావం కనబరిచిన కార్లకు గురించిన ప్రత్యేక జాబితా...

2017 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

ప్రపంచపు తొలి సోలార్ ప్యానెల్ రహదారి ప్రారంభం

ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా ఫ్రాన్స్ దేశంలో సౌర ఫలక (సోలార్ ప్యానెల్)ల రహదారిని ప్రారంభించారు.

 
Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford EcoSport Facelift To Be Launched In January 2017
Story first published: Tuesday, December 27, 2016, 12:21 [IST]
Please Wait while comments are loading...

Latest Photos