1,12,000 రుపాయలు వరకు తగ్గిన ఎకో స్పోర్ట్ ధరలు

By Anil

ఫోర్డ్ వారి బెస్ట్ ఎస్‌యువి అయిన ఎకో స్పోర్ట్ మీద భారీ స్థాయిలో ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. వేలల్లో అని అనుకుంటున్నారా ? ఏకంగా 1,12,000 రుపాయల వరకు తగ్గింపు ప్రకటించినట్లు తెలిపింది ఫోర్డ్. ఎస్‌యువిల మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఎకో స్పోర్ట్ మీద ఇలా భారీస్థాయిలో ధరలను తగ్గించడం వెనుక ఉన్న కారణం మరియు కోతలు విధించిన తరువాత ఎకో స్పోర్ట్ వాహనాల అసలు ధరలను వేరియంట్ల ప్రకారం క్రింది స్లైడర్లలో ఇవ్వడం జరిగింది.

ధరలను తగ్గించడానికి గల కారణం

ధరలను తగ్గించడానికి గల కారణం

మారుతి సుజుకి తమ సరికొత్త బ్రిజా కారును మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి అందరకీ తెలిసిందే. అయితే వితారా బ్రిజా ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు ప్రకటించింది. అయితే ఫీచర్లు మరియు ఇతర వాటితో పోల్చితే రెండు ఎస్‌యువిలు కూడా దాదాపుగా సమానంగా ఉంటాయి. అయితే ఎకో స్పోర్ట్ అమ్మకాలను వితారా బ్రిజా ఎక్కడ కొల్లగొడుతుందో ఏమో అనే అనుమానంతో ఫోర్డ్ తమ వాహనాల మీద భారీ స్థాయిలో ధరల తగ్గింపు ప్రకటించినట్లు తెలిసింది.

 ఫోర్డ్ ఎకో స్పోర్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

  • 1.5-లీ టిఐ-విసిటి ఆంబియంట్ మీద తగ్గింపు రూ. 53,700 మరియు దీని అసలు ధర రూ. 6,68,800
  • 1.5-లీ టిఐ-విసిటి ట్రెండ్ మీద తగ్గింపు రూ. 77,40 మరియు ప్రస్తుతం ధర రూ. 7,40,900
  • 1.5-లీ టిఐ-విసిటి టైటానియమ్ మీద తగ్గిన ధర రూ. 77,400 మరియు ప్రస్తుతం ధర రూ. 8,56,500
  • ఫోర్డ్ ఎకో స్పోర్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

    ఫోర్డ్ ఎకో స్పోర్ట్ డీజల్ వేరియంట్ల ధరలు

    • 1.5-లీ టిఐ-విసిటి టైటానియమ్ (ఏటి) మీద తగ్గిన ధర రూ. 74,800 మరియు ప్రస్తుత ధర రూ. 9,61,500
    • 1.0-లీ ఎకోబూస్ట్ ట్రెండ్ ప్లస్ మీద తగ్గిన ధర రూ. 77,400 మరియు ప్రస్తుత ధర రూ. 8,18,900
    • 1.0-లీ ఎకోబూస్ట్ టైటానియమ్ ప్లస్ మీద తగ్గిన ధర రూ. 87,400 మరియు 9,45,000
    • ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ల మీద తగ్గిన ధరలు

      ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ల మీద తగ్గిన ధరలు

      • 1.5-లీ టిడిసిఐ ఆంబియంట్ మీద తగ్గిన ధర రూ1,12,000 మరియు ప్రస్తుత ధర రూ. 7,28,00
      • 1.5-లీ టిడిసిఐ ట్రెండ్ మీద తగ్గిన ధర రూ. 1,12,000 మరియు ప్రస్తుతం ధర రూ. 8,00,900
      • 1.5-లీ టిడిసిఐ ట్రెండ్ ప్లస్ మీద తగ్గిన ధర రూ. 1,12,000 మరియు ప్రస్తుత ధర రూ. 8,48,900
      • ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ల మీద తగ్గిన ధరలు

        ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ వేరియంట్ల మీద తగ్గిన ధరలు

        • 1.5-లీటర్ టిడిసిఐ టైటానియమ్ మీద తగ్గిన ధర రూ. 1,12,000 మరియు ప్రస్తుత ధర 9,16,500
        • 1.5-లీ టిడిసిఐ టైటానియమ్ ప్లస్ మీద తగ్గిన ధర రూ. 1,12,000 మరియు ప్రస్తుత ధర రూ. 9,75,000
        • గమనిక : మీకు తెలియజేసిన ప్రస్తుత ధరలు అన్ని కూడా తగ్గింపు తరువాత ఉన్న ధరలుగా గుర్తించగలరు మరియు అన్ని ధరలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)గా ఉన్నాయి
        • ఎకో స్పోర్ట్ డిజైన్

          ఎకో స్పోర్ట్ డిజైన్

          ఫోర్డ్ మోటార్స్ వారు తమ ఎకో స్పోర్ట్ ఎస్‌యువిను అంతర్జాతీయ ఫియస్టా బి-సెగ్మెంట్ ఫ్లాట్ ఫామ్ మీద డిజైన్ చేశారు. దీనికి ముందు వైపున అతి పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు న్యారో హెడ్ లైట్లను కల్పించారు. వెనుక వైపున స్పేర్ వీల్ ‌ను అమర్చుకునేందుకు ప్రత్యేకమైన స్లాట్‌ను కల్పించారు. దీని వలన ఈ ఎకో స్పోర్ట్ మరింత స్పోర్టివ్‌గా కనిపిస్తోంది.

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఇంజన్ వివరాలు

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఇంజన్ వివరాలు

          ఫోర్డ్ వారి ఎకో స్పోర్ట్ ఎస్‌యివి ప్రస్తుతం 1.5-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ వేరియంట్లలో మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లో అందుబాటులో కలదు.

          పవర్ మరియు టార్క్ వివరాలు

          పవర్ మరియు టార్క్ వివరాలు

          1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్, 140 ఎన్ఎమ్ టార్క్ మరియు 1.0-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ 124 బిహెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు ఇందులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

          ట్రాన్స్‌మిషన్ వివరాలు

          ట్రాన్స్‌మిషన్ వివరాలు

          ఎకో స్పోర్ట్ ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.5-లీటర్ టైటానియమ్ పెట్రోల్ వేరియంట్లో ఆటోమేటిక్ మరియు ఇతర వాటిలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ అందించారు.

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని ఫీచర్లు

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని ఫీచర్లు

          ఎకో స్పోర్ట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్, డ్రైవర్ సీటు ఎత్తును సరిచేసుకునే ఫీచర్లు, ఎలక్ట్రిక్ ద్వారా బాహ్యపు అద్దాలను అడ్జెస్ట్ చేసుకునే అవకాశం మరియు యుఎస్‌బి, ఎయుఎక్స్, బ్లూటూత్ కనెక్టివిటి గల 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని భద్రత ఫీచర్లు

          ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లోని భద్రత ఫీచర్లు

          ఎకో స్పోర్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.

          1,12,000 రుపాయలు వరకు తగ్గిన ఎకో స్పోర్ట్ ధరలు
          • దక్షిణ భారత సినీ తారల ఖరీదైన కార్లు: దుమ్ములేపిన తెలుగు యంగ్ హీరోలు
          • వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం

Article Published On: Saturday, March 12, 2016, 9:49 [IST]
English summary
Ford Slashes EcoSport SUV Prices
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+