ఫోర్డ్ ఎండీవర్ గురించి వినియోగదారులు ఏమంటున్నారంటే
ఫోర్డ్ కార్ల సంస్థ ఇండియన్ మార్కెట్లోకి ఈ ఏడాది జనవరి నెలలో తమ సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువిని విడుదల చేసింది. ముంబాయ్‌ని వేదికగా చేసుకుని ఈ ఎస్‌యువిని 24.75 లక్షలు (ఎక్స్ షోరూమ్ ముంబాయ్)గా విడుదల చేసింది. విడుదల చేసి ఇన్ని రోజులు అయినా కూడా ఇంకా వీటి డెలివరీ కోసం ఎనిమిది నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది.
అయితే ఈ వెయిటింగ్ పీరియడ్ చాలా వరకు భారతీయుల్లో తీరని వేదనను మిగిల్చుతోంది. చెన్నైకి చెందిన అష్లే కోష్యా తిరుపూరులో తన ఐదు ఎకరాల పొలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు. అక్కడ నుండి పాలు, కూరగాయలు, నెయ్యి, పండ్లు వంటి వాటిని ట్రేడర్ కోష్యా పేరుతో అమ్ముతుంటాడు.
ఇతను ఫోర్డ్ ఎండీవర్ బుక్ చేసుకున్న వారిలో ఒకడు ఫోర్డ్ తమ ఎండీవర్ ఎస్‌యువి డెలివరీ కోసం ప్రకటించిన కాలపరిమితికి తాను ఎంతో భాదపడుతూ, ఎండీవర్ మీద ఎందుకు ఇంత కాలపరిమతిని ఉంచిదో అంటూ తన భావనను మాతో చెప్పుకొచ్చాడు . క్రింది స్లైడర్ల ద్వారా అతను ఏమంటున్నాడో మీరే చూడండి.

అష్లే ఇతనికి ఫోర్ వీలర్స్ అంటే ఎంతో ఇష్టం అట. అందులో భాగంగానే తాను చెన్నైలోని ఫోర్డ్ షోరూమ్‌లో ఎండీవర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్‌ని కొనుగోలు చేయడానికి వెళ్లాడు.

అయితే షోరూమ్ ప్రథినిదులు ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎనిమిది నెలల తరువాత అందిస్తామని తెలిపారని చెప్పాడు. ఫోర్డ్ ఎండీవర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారుగా 35 లక్షలు ఆన్ రోడ్‌గా ఉంది.

ఆ షోరూమ్ వారు ఇచ్చిన సమధానానికి నిరాశ చెందిన ఆష్లే ఎండీవర్ కోసం మరొక ఫోర్డ్ షోరూమ్‌ను సంప్రదించగా అక్కడ కూడా అదే సమాదానం ఎదురైంది.

దీనికి ఆష్లే మాట్లాడుతూ ఈ ఆధునిక ప్రపంచంలో ఫోర్డ్ ఇలా ఏకంగా ఎనిమిది నెలల వెయిటింగ్ పీరియడ్ ప్రకటించడం చాలా విచిత్రంగా ఉందని డ్రైవ్‌స్పార్క్‌తో చెప్పుకొచ్చాడు.

అయితే ఇది కాకుండా మరేదైనా ఎంచుకోవాలని అని కూడా ఆలోచించాడు. కాని ప్రస్తుతం ఫోర్డ్ ఎండీవర్‌కు పోటీగా ఉన్న షెవర్లే ట్రయల్ బ్లేజర్‌ను ఎంచుకోవాలని చూశాడు. అయితే ఇది ఆఫ్ రోడ్ మీద పెద్దగా పనితీరు చూపదని ఆగిపోయినట్లు తెలిపాడు.

కాబట్టి షెవర్లే వారి ట్రయల్ బ్లేజర్‌ను కాదని ఇతను ఎండీవర్‌కే మొగ్గాడు. మరి ఇందులో ఎటువంటి విశిష్టమైన ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం రండి.

డిజైన్
ఫోర్డ్ తమ నయా ఎండీవర్ ఎస్‌యువిలో ముందు జనరేషన్ కన్నా ఎంతో అధునాతనమైన డిజైన్ అందించారు. అందులో బాక్స్ రూపంలో ఉండే ఎస్‌యువి డిజైన్, ముందు మరియు ప్రక్కవైపుల గల కండలు తిరిగి డీకాల్స్ మొత్తానికి మంచి స్పోర్టివ్ లుక్‌ని సొంతం చేసుకుందని చెప్పవచ్చు.

ఇంజన్ వివరాలు
- 2.2-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ 158 బిహెచ్‌పి పవర్ మరియు 385 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- 3.2-లీటర్ టర్బో డీజల్ ఇంజన్ 197 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
- 2.2-లీటర్ టర్బో డీజల్ వేరియంట్ లీటర్‌కు 14.12 కిమీ లు
- 3.2-లీటర్ టర్బో డీజల్ వేరియంట్ 10.91 కిమీ లు
- ఇంధన ట్యాంకు సామర్థ్యం: 80-లీటర్లు
- వితారా బ్రిజాను విడుదల చేసిన మారుతి సుజుకి ధర రూ.6.99 లక్షలు: మరిన్ని వివరాలు కోసం
- లీపు నెలలో టాపులేపిన కార్ల అమ్మకాలు

ట్రాన్స్‌మిషన్ వివరాలు
ఫోర్డ్ మోటార్స్ వారు తమ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువిలో గల రెండు ఇంజన్ ఆప్షన్లకు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. అంతే కాకుండా రెండు వేరియంట్లు కూడా 2-వీల్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

మైలేజ్

ఫీచర్లు
ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువిలో ఉన్న కొన్ని ఆధునిక ఫీచర్లు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. సన్‌రూఫ్, ఎలక్ట్రికల్ డ్రైవర్ అడ్జెస్టబుల్ సీట్, 10-స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, పవర్ టెయిల్ గేట్, పవర్ ఫోల్డింగ్ సీట్లు, టెర్రైన్ మేనేజ్‌మెంట్ కంట్రోల్, ఎల్‌ఇడి లైట్లు, 18-అంగుళాల చక్రాలు మరయు నాలుగు చక్రాలు కూడా డిస్క్ బ్రేకులను కలిగి ఉన్నాయి.

భద్రత
ఫోర్డ్ ఎండీవర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో 7-ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ క్లైంబ్ మరియు డిసెంట్ కంట్రోల్ అధేవిదంగా ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రత ఫీచర్లు కలవు.

ఫోర్డ్ ఎండీవర్ లోని అంశాలన పరిశీలించిన తరువాత చూస్తే ఇది నిజంగానే అత్భుతమైన ఉత్పత్తి. చక్కటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాని ఫోర్డ్ వారు వీటిని సరైన సమయానికి డెలివరీ ఇవ్వడానికి వారి దగ్గర ఖచ్చితమైన సమయం లేదు. అయితే ఈ కారణం చేత ఫోర్డ్ తమ ఎండీవర్ అమ్మకాలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.



Click it and Unblock the Notifications