ఎండీవర్ విడుదల తేదీని ప్రకటించిన ఫోర్డ్ మోటార్స్
ఫోర్డ్ మోటార్స్ వారు ఇప్పటికే ఫోర్డ్ ఎండీవర్ కారును భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అయితే దీనిని జనవరి 20, 2016 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫోర్డ్ మోటార్స్ నుండి అతి త్వరలో విడుదల కానున్న ఈ ఎండీవర్ యస్‌యువి ఫోర్డ్ వారి మూడవ జనరేషన్ కారును అని తెలిపారు.
ఫోర్డ్ ఎండీవర్ యస్‌యువి గురించి మరిన్ని సాంకేతిక వివరాలు మరియు ధర వంటి విషయాలు గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బుకింగ్స్
దేశ వ్యాప్తంగా గల ఫోర్డ్ మోటార్స్ వారి డీలర్లు ఈ సరికొత్త ఎండీవర్ కు చెందిన బుకింగ్‌లను ప్రారంభించినట్లు తెలిసింది. మరియు బుకింగ్ యొక్క ప్రారంభ ధర లక్ష రుపాయలుగా నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా
ప్రస్తుతం ఈ ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండనుంది. కాని ఢిల్లీలో 2000 సీసీ కన్నా ఎక్కువ సీసీ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసిన నేపథ్యంలో ఢిల్లీలో ఇవి అందుబాటులో ఉండవు.

ఇంజన్
2016 సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువి కారులో రెండు ఇంజన్‌లు అందుబాటులో కలవు.
- 3.2-లీటర్ టిడిసిఐ టర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్
- 2.2-లీటర్ టిడిసిఐ టర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్

పవర్
3.2-లీటర్ కెపాసిటి గల ఇంజన్ 197 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయగలదు మరియు 2.2-లీటర్ కెపాసిటి డీజల్ ఇంజన్ 158 బిహెచ్‌పి పవర్ మరియు 385 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను విడుదల చేయగలదు

ట్రాన్స్‌మిషన్ అండ్ డ్రైవ్
ఫోర్డ్ ఈ ఎండీవర్ కారులో ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కల్పించింది. 2.2-లీటర్ ఇంజన్ 4X4 మరియు 4X2 డ్రైవ్ ఆప్షన్‌లో మరియు 3.2-లీటర్ ఇంజన్ కేవలం 4X4 డ్రైవ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో కలదు.

ధర
సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువి ధర దాదాపుగా 20 నుండి 25 లక్షలు ఎక్స్ షోరూమ్ మధ్య ఉండవచ్చు

పోటి
ప్రస్తుతం ఇది మార్కెట్లో ఉన్న షెవర్లే ట్రయల్ బ్లేజర్ , మిత్సుబిషి పజేరో స్పోర్ట్, శాంగ్ యాంగ్ రెక్ట్సాన్ మరియు టయోటా ఫార్చ్యూనర్ కార్లకు పోటిగా నిలవనుంది.


Click it and Unblock the Notifications








