భారతీయ మార్కెట్లోకి ఎండీవర్‌ను విడుదల చేసిన ఫోర్డ్ ధర రూ. 24.75 లక్షలు
భారతీయ మార్కెట్లోకి ఫోర్డ్ ఇండియా సరికొత్త ఎండీవర్ ఎస్‌యువి ను రూ. 24.75 లక్షలతో విడుదల చేసింది. ఇది ఫోర్డ్ వారి సరికొత్త ప్రీమియమ్ ఎస్‌యువి అని ఈ సందర్భంలో తెలుపారు.

ఫోర్డ్ ఎండీవర్ ధరలు:
2.2-లీటర్ మ్యాన్యువల్ (4X2)ధర రూ. 24,75,094
2.2-లీటర్ ఆటోమేటిక్ (4X2)ధర రూ. 25,53,468
2.2-లీటర్ టైటానియమ్ (4X2) ధర రూ. 27,36,344
2.2-లీటర్ మ్యాన్యువల్ (4X4) ధర రూ. 26,68,418
3.2-లీటర్ ఆటోమేటిక్ (4X4) ధర రూ. 27,78,142
3.2-లీటర్ టైటానియమ్ (4X4) ధర రూ. 29,46,388
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) గా ఉన్నాయి.
ఇంజన్ మరియు గేర్ బాక్స్:
సరికొత్త ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువి రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో కలదు. 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ దాదాపుగా 158 బిహెచ్‌పి పవర్ మరియు 385 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండవ ఇంజన్ ఆప్షన్ 3.2-లీటర్ నాలుగు సిలిండర్ల టర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ దాదాపుగా 197 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.
ఫోర్డ్ ఎండీవర్ రెండు చక్రాల డ్రైవ్ మరియు నాలుగు చక్రాల డ్రైవ్ ఛాయిస్‌లలో లభిస్తోంది. మరియు ఆప్షనల్ గా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలదు. 2.2-లీటర్ ఇంజన్ 14.12 కిలోమీటర్లు మరియు 3.2-లీటర్ ఇంజన్ 10.91 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలవు. రెండింటిలో కూడా 80-లీటర్ల ఇంధన సామర్థ్యం గల ట్యాంకు కలదు.
విశిష్టతలు:
ఫోర్డ్ వారి ప్రీమియన్ ఎస్‌యువి సరికొత్త ఎండీవర్‌లో సన్‌రూఫ్, పవర్ సీట్లు, క్లైమేట్ కంట్రోల్, 10 స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, పార్క్ అసిస్ట్, టెర్రైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, పవర్ ఫోల్డింగ్ సీట్లు, ముందు వైపున ఉన్న పేరుకు ఎల్‌ఇడి లైట్లతో వెలుతురు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేశారు.
భద్రత:
భద్రత పరంగా ఫోర్డ్ వారు టాప్ వేరియంట్లో ఉన్న ఎండీవర్ కారులో ఏడు ఎయిర్ బ్యాగులు, హిల్ క్లైంబ్ మరియు డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి భద్రత ఫీచర్లను అందించారు.
లభించురంగులు:
ఫోర్డ్ ఎండీవర్ ఆరు విభిన్న రంగుల్లో లభించనుంది: సన్‌సెట్ రెడ్, డైమండ్ వైట్, బోల్డెన్ బ్రాంజ్, మూన్ డస్ట్ సిల్వర్, ప్యాంథర్ బ్లాక్ మరియు స్మోకి గ్రే. ఫోర్డ్ వారి ఈ నూతన ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న షెవర్లే ట్రయల్‌బ్లేజర్ కు ప్రత్యక్షంగా పోటిని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications


































