2.82 లక్షల వరకు తగ్గిన ఫోర్డ్ ఎండీవర్ ధర: త్వరపడండి
ఫోర్డ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంచిన ఎండీవర్ మీద భారీగా ధరల తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా ఎండీవర్ లోని మూడు అతి ముఖ్యమైన వేరియంట్ల మీద ధరలు తగ్గాయి. ఎండీవర్‌లోని టైటానియమ్ వేరియంట్ల ధరలలో ఏ మార్పు లేదు.

ప్రారంభంలో ఎండీవర్ లోని టైటానియమ్ వేరియంట్ల మీద సుమారుగా 50,000 రుపాయల వరకు ధరలను పెంపును ప్రకటించింది. అయితే ఇప్పుడు పర్ఫామెన్స్ ఎస్‌యువిలను ఇష్టపేడే ఔత్సాహికుల కోసం భారీగ ధరలను తగ్గించింది.

- 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ మీద రూ. 1,72,800 లు తగ్గింది.
- 2.2-లీటర్ 4X4 మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ మీద రూ. 2,82,000 లు తగ్గింది.
- 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ మీద రూ. 1,72,800 లు తగ్గింది.
- 2.2-లీటర్ 4X2 మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ ధర రూ. 25,00,800 లు
- 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ ధర రూ. 23,78,000 లు
- 2.2-లీటర్ 4X4 మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ ధర రూ. 23,78,000 లు
- 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టైటానియం ధర రూ. 27,50,800 లు
- 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ట్రెండ్ ధర రూ. 25,93,000 లు
- 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ టైటానియం ధర రూ. 29,76,800 లు గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
- హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ విడుదల: ప్రారంభ ధర రూ. 51,653 లు

ధరలు తగ్గింపు తరువాత పోర్డ్ ఎండీవర్ కొత్త ధరల వివరాలు


2016 ఏడాది ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి ఫ్రెంచ్‌కు చెందిన ఫోర్డ్ ఈ ఎండీవర్ ఎస్‌యువిలను విడుదల చేసింది. దీనిని 2.2-లీటర్ మరియు 3.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో విడుదల చేసింది.

ఇందులోని 2.2-లీటర్ ఇంజన్ 158బిహెచ్‌పి పవర్ మరియు 385ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 3.2-లీటర్ ఇంజన్ సుమారుగా 197బిహెచ్‌పి పవర్ మరియు 470ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యువిలను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను అందించింది. (కేవలం 3.2-లీటర్ ఇంజన్ గల వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు)



Click it and Unblock the Notifications








