ఫిగో మరియు ఆస్పైర్‌ల మీద ప్రత్యేక ధరలు: ఫోర్డ్
ఫోర్డ్ ఇండియా కొత్తగా కార్లను కొనుగోలు చేసే వారికి ఆఫర్లను మరియు డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ కాంక్ట్ సెడాన్‌లను స్పెషల్ ధరలో అందుబాటులో ఉంచింది.

అమెరికాకు చెందిన కార్ల తయారీ సంస్థ దేశీయంగా తమ కొత్త ఉత్పత్తుల మీద ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదీ కూడా ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌ల మీద ప్రకటించడం గమనార్హం.

ఫోర్డ్ ఫిగో టైటానియమ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.95 లక్షలు మరియు డీజల్ వేరియంట్ టైటానియమ్ ధర రూ. 7.04 లక్షలు ఉండేది.

వీటి ధరలను సవరిస్తూ ఫిగో టైటానియమ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.66 లక్షలు అదే విధంగా ఫిగో టైటానియమ్ డీజల్ వేరియంట్ ధర రూ. 6.54 లక్షలుగా ప్రకటించింది.

ఫిగో ఆస్పైర్ టైటానియమ్ వేరియంట్ పాత ధరలు 6.90 లక్షలు (పెట్రోల్) మరియు 7.99 లక్షలు (డీజల్)ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

పోర్డ్ సవరించిన నూతన ధరల ప్రకారం ఫోర్డ్ ఆస్పైర్ టైటానియమ్ పెట్రోల్ ధర రూ. 5.99 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 7.09 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

ఫోర్డ్ వారి ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఫిగో ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లను ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్‌తో అందిస్తున్నారు. రెండు ఉత్పత్తుల మీద 8.4 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును ప్రకటించారు.

ప్రస్తుతం ఫిగో మరియు ఆస్పైర్‌లు 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుహబాటులో ఉన్నాయి.

పెట్రోల్ ఇంజన్ సుమారుగా 87బిహెచ్‌పి పవర్ మరియు 112ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అదే విధంగా డీజల్ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని పెట్రోల్ ఇంజన్ 18.16 కిలోమీటర్ల మైలేజ్ అదే విధంగా డీజల్ ఇంజన్ 25.83కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

- మారుతి సుజుకి స్విఫ్ట్ వర్సెస్ ఫోర్డ్ ఫిగొ
- విజయ పథంలో దూసుకెళ్తున్న 2015 ఫోర్డ్ ఫిగొ


Click it and Unblock the Notifications








