ఫిగో మరియు ఫిగో ఆస్పైర్‌లలో తాకేతెరె ఇన్ఫోటైన్‌మెంట్ అందిస్తున్న ఫోర్డ్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ తమ బ్రాండ్ పేరుతో సరికొత్త తాకేతెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లను అభివృద్ది చేస్తోంది. వీటిని తమ భవిష్యత్ కార్లలో అదే విధంగా ఫిగో మరియు ఫిగో ఆస్పైర్‌లలో కూడా అందివ్వనుంది. ప్రస్తుతం అన్ని కార్ల సెగ్మెంట్లలో కూడా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కోరుకునే వారు ఎక్కువయ్యారు. ఈ కారణం చేతనే ఫోర్డ్ వీటి తయారీని కూడా చేపట్టనుంది.

ఫోర్డ్ మోటార్స్ ఈ తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను ఫిగో మరియు ఫిగోఆస్పైర్‌లలో అందించిన తరువాత తమ శ్రేణిలో ఉన్న అన్ని ఉత్పత్తులలో కూడా అందివ్వనుంది.
నూతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తరువాత వీటి ఉత్పత్తులలో ఇంతకు ముందు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్న ప్రదేశాన్ని కొద్ది మార్చనున్నారు. టచ్ చేయడానికి మరింత వీలు కల్పించడానికి డ్యాష్ బోర్డును కూడా రీ డిజైన్ చేయనున్నారు.
షిప్పింగ్ పరిశ్రమకు కేంద్ర బిందువైన పనామా కాలువ గురించి అద్బుతమైన నిజాలు
కార్లలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత కార్ల అమ్మకాలు మరింత పెరిగాయి. అందుకోసం ఈ ఫీచర్‌ను అభివృద్ది చేసే పనిలో ఎక్కువ శ్రద్ద చూపిస్తోంది ఫోర్డ్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కలిగి ఉండి తక్కువ ధరతో అందుబాటులో ఉన్న కారు రెనో క్విడ్.


Click it and Unblock the Notifications