48,000 ఎకోస్పోర్ట్ వాహనాలను రీకాల్ చేసిన ఫోర్డ్: కారణం ?

By Anil

అమెరికా ఆధారిత ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా దేశీయ మార్కెట్లో తమ ఎకో స్పోర్ట్ వాహనాలను సుమారుగా 48,000 ల వరకు రీకాల్ చేసింది. రెండు ముఖ్య కారణాల వలన ఇంత పెద్ద మొత్తంలో ఎకో స్పోర్ట్‌లను రీకాల్‌ చేసినట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ రీకాల్

2013 ఏప్రిల్ నుండి 2014 ఏప్రిల్ మధ్య కాలంలో ఉత్పత్తి అయిన వాహనాలను రీకాల్ చేశారు. రీకాల్‌కు ముఖ్య కారణం ఇంధన మరియు బ్రేక్‌ లైన్లను పట్టి ఉంచి క్లిప్పులలో లోపం ఉన్నట్లు గుర్తించారు. అది కూడా డీజల్ వేరియంట్లలోని వాటిలో మాత్రమే ఈ సమస్యను గుర్తించినట్లు తెలిసింది.
Also Read: ISIS మరియు రష్యా ప్రధాని పుతిన్ గుండెల్లో గుబులు పుట్టించనున్న బ్రిటీష్
ఫోర్డ్ ఇండియా మరొక కారణంతో జనవరి 2016 నుండి ఫిబ్రవరి 2016 మధ్యలో ఉత్పత్తయిన వాటిలో సుమారుగా 700 యూనిట్లను సీటు మలిపే దానిలో సమస్య వలన రీకాల్ చేశారు. 60/40 నిష్పత్తిలో సీటును మడపాల్సిన వాటిలో కేవలం 40 శాతం వరకు సీటును మడపగలం. దానికంటే ఎక్కువగా మడపడానికి ప్రయత్నిస్తే బోల్టులు విరిగిపోతాయి. కాబట్టి వాటిని మార్చాల్సి ఉంటుంది.
Also Read: ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ ఉంటే చాలు ఈ దేశాలలో డ్రైవింగ్ చేయవచ్చు
వినియోగదారుల భద్రత దృష్ట్యా వీటిని రీకాల్ చేశామని ఫోర్డ్ ఇండియా తెలిపింది. అదే విధంగా పైన చెప్పిన సమస్యలను తమ వాహనాలలో గుర్తించినట్లయితే వాహనదారులు సంభందిత డీలర్లను సంప్రదించాల్సిందిగా ఫోర్డ్ తెలిపింది మరియు వాటికి సంభందించిన సర్వీసును ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

More from DriveSpark

Article Published On: Saturday, May 21, 2016, 16:44 [IST]
English summary
Over 48,000 Ford EcoSport Recalled In India For Two Issues
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+