ఐదు డోర్ల ఫియస్టాను విడుదల చేసిన ఫోర్డ్
ఫోర్డ్ మోటార్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న 2016 ప్యారిస్ మోటార్ షో వేదిక మీద తమ ఐదు డోర్ల ఫియస్టా ఎస్‌టి ని ప్రదర్శించాల్సి ఉంది. అయితే దానికంటే ముందుగా విడుదల చేసింది.

మీరు గనుక ఫోర్డ్‌కు చెందిన ఫియస్టా స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఐదు డోర్లు మరియు డోర్ల ఆప్షన్‌తో ఎంచుకోవచ్చు.

మీరు గనుక ఫోర్డ్‌కు చెందిన ఫియస్టా స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఐదు డోర్లు మరియు డోర్ల ఆప్షన్‌తో ఎంచుకోవచ్చు.

ఫోర్డ్ లోని మూడు డోర్ల ఫియస్టా హ్యాచ్‌బ్యాక్‌లో 180బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

రహదారి మీద నిజమైన పరిస్థితుల్లో ఇది లీటర్‌కు గరిష్టంగా 13.33 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. కేవలం 6.9 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఫియస్టా హ్యాచ్‌బ్యాక్ లీటర్‌కు 16.40 కిలోమీటర్లు ఇవ్వగలదని ఫోర్డ్ తెలిపింది.

ఐదు డోర్లు కలిగిన ఫోర్డ్ ఫియస్టా ఎస్‌టి లో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, బెస్పోక్ ఫ్రంట్ గ్రిల్, రియర్ డిఫ్యూసర్ మరియు ఐదు విభిన్నమైన రంగులతో పాటు రేస్ రెడ్ మరియు స్పిరిట్ బ్లూ వంటి రంగుల్లో లభించును.

ఫోర్డ్ మోటార్స్, తమ ఫియస్టా ఎస్‌టి200 మోడల్‌ని ఐదు డోర్ల ఆప్షన్‌లో అందించడం లేదు. ఇండియన్ మార్కెట్లోకి ఈ ఐదు డోర్ల ఫియస్టాను విడుదల అంశానికి సంభందించి ఇంకా ఏవిధమైన స్పష్టమైన సమాచారం లేదు.


Click it and Unblock the Notifications








