52 ఏళ్ల తరువాత: ఫోర్డ్ మస్టాంగ్ దేశీయంగా విడుదల
ఒకటి కాదు రెండు కాదు 52 ఏళ్ల నిరీక్షణ, అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ 1964 మొదటి సారిగా మస్టాంగ్ కారును విడుదల చేసింది. అప్పటి నుండి సుమారుగా 52 ఏళ్ల వరకు ఫోర్డ్ ఏడాదికొకటి చొప్పున మస్టాంగ్‌ను విడుదల చేస్తూ చేస్తూ వచ్చింది. 52 ఏళ్ల తర్వాత ఫోర్డ్ సంస్థ తమ మస్టాంగ్‌ను మొదటి సారిగా భారతీయుల కోసం విడుదల చేసింది.
ఫోర్డ్ ఇకానిక్ మస్టాంగ్ జిటి కారు ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు గురించి.

ఫోర్డ్ మస్టాంగ్
ఫోర్డ్ మోటార్స్ తమ మస్టాంగ్ సూపర్ కారు ధరను రూ. 65 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రకటించింది. 52 ఏళ్ల చరిత్రలో మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన మస్టాంగ్‌కు సంభందించిన బుకింగ్స్‌ను ఢిల్లీ మరియు ముంబాయ్ నగరాలలో ప్రారంభించారు.

ఇంజన్
ఫోర్డ్ మస్టాంగ్ కారులో 5.0 లీటర్ సామర్థ్యం ఉన్న వ8 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 395.5బిహెచ్‌పి పవర్ మరియు 515ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ మరియు గరిష్ట వేగం
ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఇది కేవలం 4.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు మస్టాంగ్ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంది.

ఫోర్డ్ మస్టాంగ్ డిజైన్
ఆరవ తరానికి చెందిన ఫోర్డ్ మస్టాంగా ముందు వైపున పొడవైన బ్యానెట్ కలదు. ముందు వైపు బ్యానెట్‌కు కొస చివరిలో పదునైన మరియు యాంగులర్ హెడ్‌ల్యాంప్ కలవు. నోరు తెరిచిన చేప ఆకారంలో ఉన్న దీని ఫ్రంట్ గ్రిల్ మధ్యలో మస్టాంగ్ ను సూచించే బ్యాడ్జిని అందించారు.

ముందువైపున కొద్దిగా పైతి రైస్ అయ్యి, వెనక్కి మల్లిన రూఫ్, వెనకున్న క్యాబిన్ మీదకు సుతారంగా వాలిపోయి ఉంది. తద్వారా దీనికి గాలి వలన కలిగే ఘర్షణ నుండి స్వల్ప ఉపశమనం పొందే అవకాశం దక్కింది.

వెనుక వైపున డిజైన్
ముందు వైపు డిజైన్‌కు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో వెనుక వైపు డిజైన్‌కు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు. వెనుక వైపున రెండు చివర్ల కూడా ట్రై-బార్ టెయిల్ ల్యాంప్స్ అందించారు మరియు బంపర్ మధ్యలో రెండు ఎగ్జాస్ట్ పైపులను ఇముడింపజేశారు.

ఫోర్డ్ మస్టాంగ్‌లోని ఫీచర్లు
- హెచ్‌ఐడి హెడ్ ల్యాంప్స్
- ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్
- సీక్వెన్షియల్ టర్న్ సిగ్నల్స్
- డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు
- లెథర్ అప్ హోల్‌స్ట్రే
- స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
- ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూవ్ మిర్రర్
- 19-అంగుళాల అల్లాయ్ చక్రాలు
- అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
- పుష్ బటన్ స్టార్ట్
- 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు కలవు.
- అబ్‌సొల్యూటన్ బ్లాక్
- ఇన్‌గాట్ సిల్వర్
- ఆక్స్‌ఫర్డ్ వైట్
- ట్రిపుల్ ఎల్లో ట్రైకోట్
- మ్యాగ్నెటిక్
- సిగ్నేచర్ రేస్ రెడ్
- 1964 నుండి ప్రతి ఏడాది ఒకటి చొప్పున ఫోర్డ్ మస్టాంగ్ కార్ల జాబితా: 52 ఏళ్లకు గాను 51 కార్లు విడుదల

ఫోర్డ్ మస్టాంగ్‌లోని ఫీచర్లు

ఎలక్ట్రానిక్ లైన్ లాక్ ఫీచర్
అద్భుతమైన డిజైన్‌తో వచ్చిన మస్టాంద్ కారులో అద్బుతమైన ఫీచర్ కలదు అదే ఎలక్ట్రానిక్ లైన్ లాక్. అనగా దీని ద్వారా బ్రేకులను ప్రయోగించినపుడు ముందు బ్రేకులు మాత్రమే ప్రయోగించబడి, వెనక బ్రేకులు సడలింపబడతాయి. ఇలా 15 సెకండ్ల సమయం పాటు జరుగుతుంది. తద్వారా వెనుక చక్రాలు అధిక పవర్ వలన అత్యధిక వేగంతో తిరుగుతాయి అప్పుడు ఒక్కసారిగా ముందు బ్రేకులు వదులైనపుడు గరిష్టం వేగంతో కారు దూసుకెళుతుంది.

డ్రైవింగ్ పద్దతులు
ఫోర్డ్ మస్టాంగ్‌లో డ్రైవర్‌కు వివిధ రకాల డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి. అవి నార్మల్, వెట్/స్నో, స్పోర్ట్ మరియు ట్రాక్.

భద్రత
భద్రత పరంగా మస్టాంగ్ ఇకానిక్ సూపర్ కారులో ఫోర్డ్ సంస్థ ఎనిమిది ఎయిర్ బ్యాగులను అందించారు. అందులో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లు, ముందు వైపు మోకాళి మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులున్నాయి. అంతే కాకుండా ప్రతి చక్రానికి వక్తిగత టైర్ ప్రెసర్ మానిటరింగ్ సిస్టమ్ తో పాటు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ మరియు వైపర్లున్నాయి.

లభించు రంగులు
ఫోర్డ్ మస్టాంగ్ ఆరు విభిన్న రంగుల్లో లభించును,



Click it and Unblock the Notifications








