ఫోర్డ్ మస్టాంగ్ విడుదల వివరాలు మరియు ఫోటోలు
ఫోర్డ్ మోటార్స్ ఇండియా వారు ఈ నెల 28 న ఆరవ తరానికి చెందిన మస్టాంగ్ కారును లాఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఫోర్డ్ మోటార్స్ వారు 1948 నుండి ఏడాదికి ఒకటి చెప్పున మస్టాంగ్ కార్లను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చారు. అయితే ఒక్క మస్టాంగ్ కారును కూడా భారతీయ మార్కెట్లోకి తీసుకురాలేదు. అయితే ఫోర్డ్ మోటార్స్ వారు 2016 సంవత్సరానికి గాను ఆరవ తరానికి చెందిన మస్టాంగ్‌ను మొత్తానికి దేశీయ మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు.

ఈ ఆరవ తరానికి చెందిన మస్టాంగ్ కారులో 420 బిహెచ్‌పి పవర్ మరియు 529 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలిగే 5.0-లీటర్ కెపాసిటి గల వి8 ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ పెడల్ షిఫ్టర్స్ ను కలిగి ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.
Also Read: ప్రతి దశాబ్దంలో ఉన్న వేగవంతమైన కార్లు: 1880 నుండి నేటి వరకు
మస్టాంగ్ కారు కేవలం 4.8 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. మరియు దీని అత్యధిక వేగం గంటకు 250 కిలోమీటర్లు ఉన్నట్లు దీని విడుదల చేసిన సందర్భంలో వెల్లడించారు.
Also Read: గత 50 ఏళ్ల నుండి ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ కారు
మస్టాంగ్ కారు ఎలక్ట్రానిక్ లైన్ లాక్ అనే ఫీచర్‌తో వచ్చింది. అంటే డ్రైవర్ బ్రేకును వినియోగించినపుడుమ ముందు చక్రాలకు మాత్రమే బ్రేకు పని చేసి, వెనుక చక్రాలకు బ్రేకులు పడకుండా 15 సెకండ్ల పాటు అలాగే చక్రాలను తిప్పుతుంది.


Click it and Unblock the Notifications


















































