దేశీయ మార్కెట్లోకి ఫోర్డ్ మస్టాంగ్ విడుదల
దేశీయ మార్కెట్లోకి ఫోర్డ్ మోటార్స్ వారు తమ ఇకానిక్ మోడల్ అయిన మస్టాంగ్ ను విడుదల చేశారు. ఫోర్డ్ మోటార్స్ వారు ఈ మస్టాంగ్ కార్లను 1964 నుండి అందిస్తున్నారు. మొదటి సారిగా భారతీయ మార్కెట్లోకి పోర్డ్ వారు తమ మస్టాంగ్ మోడల్‌ను ఈ రోజు విడుదల చేశారు.
ఫోర్డ్ మోటార్స్ వారి ఇకానికి మస్టాంగ్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఫోర్డ్ మస్టాంగ్ ధర
ఫోర్జ్ వారి ఈ మస్టాంగ్ ధర దాదాపుగా రూ. 50 నుండి 60 లక్షల మధ్య ఉండవచ్చు. (దీని ధర ఇంకా వెల్లడించలేదు)

సాంకేతిక వివరాలు
దేశీయ మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి మస్టాంగ్ కారులో 5.0-లీటర్ కెపాసిటి గల వి8 ఇంజన్ కలదు.

పవర్
మస్టాంగ్ లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ 435 బిహెచ్‌పి పవర్ మరియు 540 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ పెడల్ షిఫ్టర్స్ గల 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో
ఫోర్డ్ మోటార్స్ వారు దీని కంటే ముందుగా అంతర్జాతీయ మార్కెట్లో 3.7-లీటర్ వి6 మరియు 2.3-లీటర్ టర్భో ఛార్జ్‌డ్ ఇంజన్‌లను అందించారు.

ఫోర్డ్ మస్టాంగ్ ఫీచర్లు
- ఎల్‌ఇడి టయిల్ ల్యాంప్స్
- తిరిగే వైపును బట్టి వెలిగే టర్న్ ల్యాంప్స్
- రెండు పొగ గొట్టాలు
- లెథర్ ఇంటీరియర్
- నార్మల్
- వెట్
- స్నో
- స్పోర్ట్
- ట్రాక్
- ఫోర్డ్ మస్టాంగ్ 50 ఏళ్ల(1964-2016) సుదీర్ఘ చరిత్ర ఫోటోలలో

ఫోర్డ్ మస్టాంగ్ ఫీచర్లు
స్టీరింగ్ ద్వారా నియంత్రించే ఫీచర్లు
18 అంగుళాల అల్లాయ్ వీల్స్
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
పుష్ బటన్ స్టార్ట్

ఎలక్ట్రానికి లైన్ లాక్
అంతే కాకుండా మస్టాంగ్ కారులో ఎలక్ట్రానికి లైన్ లాక్ అనే ఫీచర్‌తో వచ్చింది. అంటే డ్రైవర్ బ్రేకును వినియోగించినపుడుమ ముందు చక్రాలకు మాత్రమే బ్రేకు పని చేసి, వెనుక చక్రాలకు బ్రేకులు పడకుండా 15 సెకండ్ల పాటు అలాగే చక్రాలను తిప్పుతుంది.

డ్రైవింగ్ మోడ్స్
ఫోర్డ్ మోటార్స్ వారు ఈ మస్టాంగా కారులో విభిన్న డ్రైవింగ్ మోడ్‌లను కల్పించారు.

ఫోర్డ్ మస్టాంగ్‌లోని భద్రత పరమైన ఫీచర్లు
ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వైపర్స్(అద్దాల మీద నుండి నీటిని తుడిచే పరికరం), టైర్లలో గల గాలి ఒత్తిడిని లెక్కగట్టే సిస్టమ్, ముందు వైపున మోకాలి ఎయిర్ బ్యాగ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగ్ తో పాటు ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగ్‌లు కలవు.



Click it and Unblock the Notifications