91,000 కార్లను రీకాల్ చేసిన ఫోర్డ్
పోర్డ్ మోటార్స్ సంస్థ విరివిగా కార్లను ఉత్పత్తి చేస్తూనే ఉంది. అదే విధంగా వినియోగదారులకు అందిస్తూనే ఉంది. అయితే ప్రక్రియలో తమ కార్లు ఎంత వరకు పర్ఫెక్టుగా ఉన్నాయి అనేది చెక్ చేయడాన్ని మాత్రం మరిచిపోతున్నట్లుంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తమ ఉత్పత్తులు రీకాల్ చేయడం ఇందుకు నిదర్శనం.

తాజాగ ఫోర్డ్ మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 88,151 యూనిట్ల కార్లను రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రీకాల్ చేయడం వెనుకున్న కారణాన్ని కోరగా తమ ఉత్పత్తుల్లో ఇంధనాన్ని పంపింగ్ చేసే కంట్రోల్స్‌లో లోపాన్ని గుర్తించినట్లు తెలిపారు.
Also Read: కియా మోటార్స్ ఇండియాలోకి విడుదల చేయనున్న వాటిలో ఇది ఒకటి
2013-15 మధ్యన ఉత్పత్తయిన ఫోర్డ్ తారస్ సెడాన్లు, ఫోర్డ్ ఫ్లెక్స్ క్రాసోవర్ యుటిలిటి వాహనాలు, లింకన్ ఎమ్‌కెఎస్ సెడాన్, లింకన్ ఎమ్‌కెటి ఎస్‌యువిలు మరియు ఫోర్డ్ ఇంటర్‌సెప్టార్ సెడాన్‌లు ఇందులో ఉన్నాయి. అదే విధంగా 2015-16 మద్య తయారైన సుమారుగా 2,472 యూనిట్ల ఫోర్డ్ ట్రాన్సిట్ వ్యాన్లలో ఫ్యూయల్ ఇంజెక్షన్ పంపు రీప్లేస్ కారణంగా రీకాల్ చేసినట్లు తెలిపారు.
Also Read: టియాగో కన్నా కైట్ 5 పెద్ద విజయాన్ని సాధిస్తుందనడానికి గల ముఖ్య కారణాలు
అయితే లోపాలతో బయటకు వెళ్లిన కార్లు మరియు వాహనాలు ఏ విధమైన ప్రమాదాలకు గురికాలేదని తెలిపారు. సకాలంలో స్పందించి వాటిని నివారించే దిశగా చర్యల తీసుకుని లోపాలను గుర్తించి వాటిని సరిచేసినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications








