నిజమే..!! ఇప్పటికీ 75 శాతం దేశీయ డైవర్లకు జిపిఎస్ ఎలా ఉపయోగించాలో తెలియదు
దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డ్రైవర్లలో ఇప్పటికీ 75 శాతం మందికి జిపిఎస్ ఫీచర్ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఇండియన్ డ్రైవర్లపై నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాలు...
ఇండియన్ డ్రైవర్ల మీద తాజాగ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన నిజాలు వెల్లడయ్యాయి. ప్రతి నలుగురు డైవర్లలో ఒక్కరికి మాత్రమే జిపిఎస్ ను ఉపయోగించుకుని ముందుగా వెళ్లాల్సిన రూట్‌ను వెతుకుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న 75 శాతం మంది డ్రైవర్లకు జిపిఎస్ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఈ సర్వేలో వెల్లడైన మరిన్ని అంశాలు చూద్దాం రండి...

- ఉన్నట్లుండి యాక్సిలరేటర్ రైస్ చేయడం మరియు బ్రేకులు వేయడం ద్వారా మైలేజ్ తగ్గిపోతుందనే విషయం పది మంది డ్రైవర్లకు గాను కేవలం నలుగురికి మాత్రమే తెలుసు.
- ప్రతి నలుగురు డ్రైవర్లకు గాను ఒకరు వెహికల్‌ను ఆగి ఉన్నపుడు ఆఫ్ చేయకుండా ఆన్ లోనే ఉంచితే మైలేజ్ పెరుగుతుందని చెబుతున్నారు.
- ఆగలేకపోతున్న చైనా...!!
- లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా..?
- హ్యుందాయ్ విడుదల చేయనున్న మూడు అప్ డేటెడ్ కార్లు


దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోర్డ్ నిర్వహించిన సర్వే ప్రకారం 95 శాతం మంది ఇండియన్ డ్రైవర్లకు తమ వాహనం నుండి గరిష్ట శక్తిని పొందడానికి ఎలా డ్రైవ్ చేయాలో తెలుసంట. మరియు 96 శాతం డ్రైవర్లు తెలిపిన మేరకు వాహనాలను నడపడానికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ సంస్థ ఆసియా మరియు ఫసిఫిక్ లలో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం 9,500 మంది డ్రైవర్లు పాల్గొనగా అందులో ఇండియా నుండి 1,020 మంది డ్రైవర్లకు ఫోర్డ్ అవకాశం ఇచ్చింది.



Click it and Unblock the Notifications








