దుబాయ్ టు కోచి మినీ కూపర్ ఇన్నోవేషన్ ముసుగులో ఏడు కిలోల బంగారం
తప్పు చేయాలనుకునే వారికి కోటి దారులు, అదే తప్పు చేసేవారిని పట్టుకునే వారికి కూడా కోటి దారులు ఉంటాయి. అర్థ కావడం లేదా ..? ఎందుకంటే ఓ ప్రభుద్దుడు ఏడు కిలోలా బంగారాన్ని కారు పెట్రోల్ ట్యాంకులో భద్రపరిచి భారత్‌కు దిగుమతి చేసుకున్నాడు. ఇంకేముంది కస్టమ్స్ అధికారులు డేగ కన్నేసి పెట్రోల్ ట్యాంక్ కన్నం నుండి ఈ 7000 గ్రాముల బంగారాన్ని భద్రంగా వెలికి తీశారు.
ఇది ఎక్కడి నుండి నుంచి వచ్చింది, ఎక్కడ దొరికింది వంటి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

మంగళూరుకు చెందిన వ్యక్తి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ఇతను దుబాయ్ నుండి కేరళలోని కొచ్చి పోర్ట్ ద్వారా తమ ఆప్తులకు మినీ కూపర్ కారును ఎగుమతి చేశాడు.

అయితే అతను కేరళలోని కాసర్‌గోడ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు దీనిని తీసుకునేలా మినీ కూపర్ కారును పంపించాడు.

అయితే అతను దాదాపుగా ఏడు కిలోల బంగారాన్ని కారు ఇంధన ట్యాంకులో భద్రపరిచి దుబాయ్ నుండి కొచ్చి ఎగుమతి చేశాడు.

అతను ఈ కారును కార్నెట్ డి పాస్సేజ్ పథకం క్రింద ఎగుమతి చేశాడి తెలిపారు. అనగా ఈ కార్నెట్ డి పాస్సేజ్ పథకం ద్వారా అంతర్జాతీయంగా కార్లను ఎటుంవటి ఎక్సైజ్ పన్నులు చెల్లించకుండా ఎగుమతి మరియు దిగుమతి చేసుకోవచ్చు.

అయితే కొచ్చిలోని కస్టమ్స్ ఆఫీసర్స్ దీనిని పరీశించనపుడు 500 గ్రాములు బరువున్న దాదాపు 14 గోల్డ్ చైన్లు లభ్యమైనట్లు తెలిపారు.

ఈ మొత్తం బంగారం విలువ దాదాపుగా 2 కోట్లు రుపాయల వరకు ఉన్నట్లు తెలిపారు.

కోచి పోర్ట్ ద్వారా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నేపథ్యంలో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

- ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు
- రియర్ వీల్ డ్రైవ్ vs ఫ్రంట్ వీల్ డ్రైవ్: లాభాలు, నష్టాలు
- దేశీయ మార్కెట్లోకి అబ్బురపరిచే బైకు: ఇండియన్ రోడ్ మాస్టర్


Click it and Unblock the Notifications








