ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సులభమైన ఉద్యోగం
ప్రపంచంలో ఏది లేకున్నా గూగుల్ లేకపోతే సుమారుగా 50 శాతం పైగా జనజీవనం స్తంభించిపోతుంది. ఇంతటి పెద్ద పేరున్న సంస్థలో ఏ చిన్న ఉద్యోగం వచ్చినా చాలు అని చాలా మంది కలలు కంటారు. కాని ఇంతటి పెద్ద సంస్థలో ఎటువంటి తల భారం లేకుండా, సింపుల్‌గా చేసుకునే ఉద్యోగం ఉంటే ఎలా ఉంటుంది. గూగుల్ ప్రస్తుతం కొన్ని పోస్ట్‌లకు నోటిఫికేషన్ జారీ చేసిది.

గూగుల్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం పూర్తి స్థాయి డ్రైవర్ రహిత కార్లను సృష్టించడానికి ఎంతో కాలంగా శ్రమిస్తున్న యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతే. ఈ ప్రయోగం చివరి దశకు చేరుకుంది. కాని ఈ డ్రైవర్ రహిత కార్ల పనితీరును తెలుసుకోవడానికి వెహికల్ సేఫ్టీ మేనేజర్ అనే పోస్ట్‌ల కోసం గూగుల్ డ్రైవర్లను ఎంపికచేసుకుంటోంది. ఈ ఉద్యోగం కావాలనుకునే వారు ఎటువంటి ప్రమాదాలు జరపనట్లు మరియు ఎటువంటి క్రిమినల్ కేసులు లేని అభ్యర్థులు ఇందుకు అర్హులు.
Also Read: బడ్జెట్ బాయ్స్‌కు పక్కా కారు.....డాట్సన్ రెడి గో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
వీరి పని, డ్రైవర్ రహిత కార్లు రోడ్ల మీద వెళుతుంటాయి అందులో వీరు కూర్చుని వాటి పనితీరు ఎప్పటికప్పుడు గూగుల్ డ్రైవర్ రహిత కార్ల విభాగానికి చేరవేయాల్సి ఉంటుంది. అందుకోసం వీరికి ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 40 పదాల వేగం కూడా ఉండాలి. వీరు గంట సమయం పాటు ఈ కారులో పనిచేస్తే 20 డాలర్లు అంటే 1,337 రుపాయలు జీతంగా పొందవచ్చు.
Also Read: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్ గురించి ఆసక్తికర విషయాలు
ఒక్క కారులో ఇద్దరు వ్యక్తులు ఉండాల్సి ఉటుంది. అందులో ఒకరు ముందు వైపున కూర్చుని కారు యొక్క పనితీరును వివరిస్తే మరొక వ్యక్తి వెనుక సీటులో కూర్చొని ల్యాప్‌ట్యాప్ నందు టైప్ చేసి సంభందిత అధికారులకు పంపిచాల్సి ఉంటుంది.
Also Read: భద్రత పరంగా ఇండియన్స్‌ను మోసం చేస్తున్న కార్ల సంస్థలు, తేల్చేసిన గ్లోబల్ ఎన్‌సిఎపి
ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు రోజు ఆరు నుండి ఎనిమిది గంటల పాటు, వారానికి ఐదు రోజులు పాటు 12 నుండి 24 నెలల వరకు పని ఉండవచ్చు లేదంటే గూగుల్ వారి అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని రోజులు పనిచెయ్యాలి అనేది ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications