మెర్సిడెస్ బెంజ్ వద్దు టాటా నానో ముద్దు అంటున్న హేమా మాళిని
బిజెపి మహిళా ఎమ్‌పి మరియు నటి హేమా మాళిని గత ఏడాది జూన్‌లో చివరిసారిగా వార్తల్లోకెక్కారు. అయితే మరోసారి హేమా మాళిని వార్తల్లో నిలిచారు. తనకంటూ ఒక నానో కారు కావాలని అందులో తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటా వెళ్లాలని ఏకంగా మెర్సిడెస్ బెంజ్ దిగి టాటా నానో ఎక్కారు.
ఈ బాలీవుడ్ తార అసలు ఈ నానో కారు ఎందుకు ఎంచుకుంది అంటారు ? ఆచోచించినా ఏమి దొరుకుతుంది చెప్పండి క్రింది స్లైడర్ల మీద క్లిక్ చేయండి ఎందుకో తెలిసిపోతుంది.

ఉత్తర ప్రదేశ్ లోని మతురా జిల్లాకు ఎమ్‌పి గా ఉన్న హేమా మాళిని తన వ్యక్తి గత అవసరాలకోసం ఈ నానో కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు.

తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుండి మతురా జిల్లాలోని విృందావన్ అనే ఊరిలో తన సొంత అవసరాలకు దీనిని కొనుగోలు చేసిందని వెల్లడించింది.

విృందాన్ ఊరిలో రోడ్లు అన్ని కూడా చాలా ఇరుకుగా ఉండటం వలన ఈ బుల్లి మైక్రో నానోను ఎంచుకుందట ఈ సినీ, రాజకీయ నాయకురాలు

అయితే ఈమె ఎంచుకున్న మోడల్ జెన్‌ఎక్స్ నానో ఈజీ షిఫ్ట్ కారు అని తెలిసింది. ఇందులో 624 సీసీ కెపాసిటి గల రెండు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇది దాదాపుగా 37.5 బిహెచ్‌పి పవర్ మరియు 51 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

ఈ కారు రెండు రకాల ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. 4-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్ బాక్స్‌లో అందుబాటులో ఉంది.

అయితే హేమా మాళిని ఎంచుకున్న కారు నానోలోని టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌టిఎ.

టాటా నానో టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌టిఎ కారు ధర రూ. 3.01 లక్షలు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) గా ఉంది

- దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే


Click it and Unblock the Notifications








