హీరో మోటోకార్ప్ మాస్టర్ ప్లాన్: వరుసగా 15 బైకుల విడుదలకు పథకం
భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2017 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 15 కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా విడుదలయ్యే మొత్తం ఉత్పత్తులు ఈ 15 లో ఉంటాయని తెలిపారు.

2017 ఆర్థిక సంవత్సరంలో విడుదలయ్యే ఉత్పత్తుల్లో అచీవర్ 150 మోటార్ సైకిల్, హీరో సూపర్ స్ల్పెండర్ మరియు ప్యాసన్ ప్రొ లతో పాటు హీరో వారి ఐ3ఎస్ టెక్నాలజీ గల ఉత్పత్తులను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

హీరో మోటోకార్ప్ సిఇఒ మరియు మేనేజింగ్ డైరెక్టర్ తెలిపిన ప్రకటనలో దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లోకి సుమారుగా 15 కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

మొత్తం 15 ఉత్పత్తుల్లో మూడింటింని దేశీయంగా ప్రారంభం కానున్న పండుగ సీజన్ నాటికి విడుదల చేయనున్నామని కూడా పవన్ ముంజాల్ వెల్లడించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడు త్రైమాసికంలో గుజరాత్ ప్లాంటు నుండి ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా హీరో ఉత్పత్తులు 2017 నాటి నుండి అర్జెంటీనాలో కూడా అందుబాటులోకి రానున్నాయి మరియు నైజీరియాలో అతి త్వరలో హీరో ఉత్పత్తులను అమ్మకాలకు సిద్దం చేయనున్నట్లు తెలిపారు.

రెండు లక్షల బడ్జెట్ లోపున్న ఏడు సూపర్ బైకులు
వేలానికి అత్యంత అరుదైన లోటస్ సి-01 మోటార్ సైకిల్
ఇండియన్ మార్కెట్ కోసం హోండా నుండి మెట్రోపాలిటన్ స్కూటర్


Click it and Unblock the Notifications








