విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్: బుకింగ్స్ ప్రారంభం
హోండా కార్స్ ఇండియా దేశీయ విపణిలోకి తమ ఆకార్డ్ హైబ్రిడ్ ప్రీమియ్ సెడాన్‌ను అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశ వ్యాప్తంగా ఉన్న హోండా వారి ఎంచుకోదగ్గ డీలర్ల వద్ద అకార్డ్ హైబ్రిడ్ యొక్క ముందస్తు బుకింగ్‌లను కూడా ప్రారంభించారు.

ఆకార్డ్ హైబ్రిడ్ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు సంభందిత డీలర్ల వద్ద రూ. 51,000 ల బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

విడుదల తేదీ మరియు బుకింగ్ ప్రక్రియలను ప్రారంభించినప్పటికీ ఇంత వరకు అకార్డ్ హైబ్రిడ్ యొక్క ధరలకు సంభందించిన వివరాలను హోండా వెల్లడించలేదు. అయితే మార్కెట్ తీరు ప్రకారం అకార్డ్ హైబ్రిడ్ ప్రీమియమ్ సెడాన్ ప్రారంభం వేరియంట్ ధర రూ. 22 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 26 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

సాంకేతికంగా హోండా ఈ అకార్డ్ హైబ్రిడ్‌లో 2.0-లీటర్ సామర్థ్య ఉండే పెట్రోల్ ఇంజన్‌ను ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో అందివ్వనున్నారు.

పెట్రోల్ ఇంజన్ సుమారుగా 141 బిహెచ్‌పి పవర్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ 75బిహెచ్‌పి పవర్ విడుదల చేయును. ఇంజన్ మొత్తం 306ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు సివిటి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

తొమ్మిదవ తరానికి చెందిన హోండా ఆకార్డ్ హైబ్రిడ్ ప్రీమియమ్ సెడాన్ కారును 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. ఈ మోడల్ ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో అమ్మకాల్లో ఉంది.

ప్రస్తుతం హోండా కార్స్ ఇండియా ఈ అకార్డ్ హైబ్రిడ్‌ను కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా దేశీయంగా అందుబాటులోకి తీసుకురానుంది.

దేశీయంగా విడుదలకు సిద్దమైన హోండా అకార్డ్ హైబ్రిడ్ మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. దీని విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదని పాఠకులు గుర్తించగలరు.

ప్రస్తుతం దేశీయ వాహన రంగంలో ఉన్న కొత్త కార్ల విడుదల సందడి పరంగా చూస్తే దీనిని దీపావలికి ముందుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న హోండా డీలర్‌ను సంప్రదించగలరు

తొమ్మిదవ తరానికి చెందిన హోండా ఆకార్డ్ హైబ్రిడ్ ప్రీమియమ్ సెడాన్

తొమ్మిదవ తరానికి చెందిన హోండా ఆకార్డ్ హైబ్రిడ్ ప్రీమియమ్ సెడాన్

వెహికల్ ప్రపంచంలో వాహన ఇన్సూరెన్స్ ఎంతో ముఖ్యం: తక్కువ ధరలో అన్ని రకాల ఇన్సూరెన్స్‌లను మరియు భారత దేశపు అత్యంత సులభమైన ఇన్సూరెన్స్ విధానాన్ని అందిస్తోన్న సంస్థ గురించిపూర్తి వివరాలకు....

ఈ యాప్ ఉంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్‌సి బుక్ లేకుండా వాహనాలను నడపవచ్చు


Click it and Unblock the Notifications








