అక్టోబర్ 25 న విడుదల కానున్న హోండా వారి హైబ్రిడ్ కారు
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలోకి సరికొత్త అకార్డ్ హైబ్రిడ్ కారును విడుదల చేయడానికి ప్రణాళిక వేసుకుంది. ఆల్ న్యూ హోండా అకార్డ్ హైబ్రిడ్ కారును అక్టోబర్ 25, 2016 విపణిలోకి విడుదల చేయనుంది.

హోండా కార్స్ ఇండియా ఈ నూతన అకార్డ్ హైబ్రిడ్‌లను కంప్లీట్లి బిల్ట్ యూనిట్‌లుగా దిగుమతి చేసుకుని అమ్మాకాలకు సిద్దం చేయనుంది.

అయితే ఇండియాలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తి మరియు కొనుగోళ్ల అభివృద్ది కోసం ఫేమ్ (FAME) అందించే రాయితీని హోండా పొందలేకపోతోంది.

ఈ సరికొత్త అకార్డ్ హైబ్రిడ్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ కలదు, దీనికి 1.3 కిలోవాట్ సామర్థ్యం గల రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అనుసంధానం చేసారు.

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్లు సంయుక్తంగా సుమారుగా 184బిహెచ్‌పి పవర్ మరియు 315ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

హోండా కార్స్ ఈ అకార్డ్ హైబ్రిడ్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్‌ను చక్రాలకు సరఫరా చేయడానికి ఇంజన్‌కు ఇ-సివిటి గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

సరికొత్త హోండా అకార్డ్ హైబ్రిడ్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా క్యామ్రీ హైబ్రిడ్‌కు సరాసరి పోటీగా నిలవనుంది. టయోటా ఈ క్యామ్రీ హైబ్రిడ్‌ను ప్రాంతీయంగా ఇండియాలో ఉత్పత్తి చేస్తోంది.

దేశీయంగా ఉత్పత్తి జరగడం వలన టయోటా క్యామ్రీ మీద పన్నుల రాయితీతో పాటు, కొన్ని పన్నుల మినహాయింపు కూడా కలదు, అయితే ఆకార్డ్‌న దిగుమతి చేసుకోవడం వలన ఈ పన్నుల రాయితీ మరియు మినహాయింపులను కోల్పోయింది.

హోండా అకార్డ్ హైబ్రిడ్ దేశీయంగా అందుబాటులోకి వస్తే, ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా రూ. 40 లక్షల వరకు ఉండే అవకాశాలున్నాయి.

అయితే దీనికి ప్రత్యక్ష పోటీగా నిలిచిన టయోటా క్యామ్రీ ధర రూ. 34.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉంది. ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా హోండా అకార్డ్ హైబ్రిడ్ అమ్మకాల్లో ఆశించిన స్థాయిలో ఉంటాయి అనడంలో కాస్త సందేహం కలుగుతోంది.

హోండా మోటార్స్ మాత్రం దేశీయంగా తమ హైబ్రిడ్ అమ్మకాలను పెంచుకునేందుకు అమితాశక్తితో ఉంది

ఇప్పటికే దేశీయంగా ఉన్న హోండా డీలర్లు అకార్డ్ హైబ్రిడ్‌కు సంభందించిన బుకింగ్‌లను ప్రారంభించారు.

- ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
- టయోటా ప్లాటినమ్ ఎటియోస్ రివ్యూ: ఇది నిజంగానే ప్లాటినమా...?
- హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ విడుదల: ప్రారంభ ధర రూ. 51,653 లు


Click it and Unblock the Notifications








