అమేజ్...! హోండా వారి అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు
హోండా మోటార్స్ వారు దేశీయ మార్కెట్లోకి సరికొత్త అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ కారును విడుదల చేశారు. ఈ సరికొత్త అమేజ్ ధర 5.29 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ప్రారంభ ధరతో విడుదల చేశారు. మార్కెట్లో ఇది వరకే అందుబాటులో ఉన్న అమేజ్ కారుకు కొన్ని మార్పులు చేర్పులు చేసి అమేజ్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేశారు.
హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కు చెందిన ధర, ఫీచర్లు మరియు సాంకేతిక వివరాలు క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

హోండా అమేజ్ పెట్రోల్ వేరియంట్ ధరలు
- E(MT)-ధర రూ. 5,29,900
- S(MT)-ధర రూ. 5,95,400
- SX(MT)-ధర రూ. 6,80,500
- VX(MT)-ధర రూ. 7,19,900
- S(AT)-ధర రూ. 7,19,900
- VX(AT)-ధర రూ. 8,19,900
- E(MT)-ధర రూ. 6,41,900
- S(MT)-ధర రూ. 7,29,900
- SX(MT)-ధర రూ. 7,82,000
- VX(MT)-ధర రూ. 8,19,900
- గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
- బ్లూయిష్ టైటానియమ్ మెటాలిక్
- ఆర్చిడ్ వైట్ పియర్ల్
- కార్నిలియన్ రెడ్ పియర్ల్
- టఫ్ఫేటా వైట్
- అల్‌బస్టర్ సిల్వర్ మెటాలిక్
- అర్బన్ టైటానియమ్ మెటాలిక్
- రష్యా ఆయుధగారంలోకి వచ్చి చేరిన శక్తివంతమైన యుద్దం వాహనం
- డస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆటోమేటిక్‌ను విడుదల చేసిన రెనో: ధర మరియు ఇతర వివరాల కోసం
- ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ విమానాశ్రయం

హోండా అమేజ్ డీజల్ వేరియంట్ ధరలు
గమనిక: అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి

ఇంజన్ వివరాలు
హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కారులో సాదారణ అమేజ్ కారులోని ఇంజన్ ఆప్షన్లను ఇందులో అందించారు. అయితే ప్రస్తుతం ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ వేరియంట్లు కలవు.

పవర్
పెట్రోల్ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నపుడు 86 బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ 3,600 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నపుడు 98 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్
ఇందులోని పెట్రోల్ ఇంజన్ 4,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 109 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మరియు డీజల్ ఇంజన్ 1,750 ఆర్‌పిఎమ్ వేగం వద్ద ఉన్నపుడు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్
పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 17.8 కిలోమీటర్లు(మ్యాన్యువల్) మరియు 18.1 కిలోమీటర్లు( ఆటోమేటిక్) గా ఇస్తాయి. మరియు డీజల్ ఇంజన్ లీటర్‌కు 25.8 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తాయి.

ట్రాన్స్‌మిషన్
హోండా అమేజ్‌లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లు రెండు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ మ్యాన్యువల్‌తో పాటుగా 5-స్పీడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లో అందుబాటులో ఉంది.

అమేజ్ డిజైన్ మార్పులు
హోండా మోటార్స్ వారు సరికొత్త అమేజ్‌కు కొత్త లుక్ తీసుకురావడం కోసం ముందు వైపున గల ఫ్రంట్ గ్రిల్‌కు ఎక్కువ క్రోమ్ పూత పూశారు దీనిని మనం హోండా సిటిలో గమనించవచ్చు. అదేవిదంగా ముందు వైపున ఎక్కువ గాలిని గ్రహించే విధంగా ఎయిర్ ఇంటేకర్‌ను పెద్దగా డిజైన్ చేశారు. వీటితో పాటు ఫాగ్ ల్యాంప్స్‌ను కూడా రీ డిజైన్ చేశారు.

అమేజ్ ఇంటీరియర్
సరికొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్యాష్‌బోర్డ్‌లను అందించారు. అయితే ఇవి హోండా జాజ్ ఎమ్‌పివిలో మనం గమనించవచ్చు. మరియు హోండా సిటి నుండి సేరించిన బ్లూటూత్ కనెక్టివిటి గల ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ దీనిని తాకే తెర ద్వారా నియంత్రించవచ్చు.

లభించు రంగులు
హోండా వారి సరికొత్త అమేజ్ ఫేస్‍లిఫ్ట్ కారు ఏడు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

అందుబాటులోకి
హోండా వారి సరికొత్త అమేజ్ ఫేస్‌లిఫ్ట్ కారుని ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గల హోండా షోరూమ్‌లలో వీటిని అందుబాటులో ఉన్నాయి.

పోటి
ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ జెంట్, ఫోర్డ్ ఫిగో ఆస్పైర్ మరియు వోక్స్‌వ్యాగన్ వారి అప్‌కమింగ్ అమియో కార్లకు పోటిగా నిలవనుంది.



Click it and Unblock the Notifications








