మార్పులు, చేర్పులతో మార్చినాటికి విడుదల కానున్న హోండా అమేజ్
హోండా కార్స్ ఇండియా తమ అమేజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఈ ఏడాది మార్ఛినాటికి మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఫేస్‌లిఫ్ట్ పేరుతో విడుదల కానున్న ఈ హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారుకు సాధారణ అమేజ్‌కు ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ మార్పులతో విడుదల చేయనున్నారు.
అయితే ప్రస్తుతం ఉన్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌కు మార్పులు చేయడానికి కారణం అమ్మకాలు జోరందుకోవడం కోసం అని తెలిసింది. మరి సరికొత్త అమేజ్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిజైన్
హోండా మోటార్స్ తమ 2016 అమేజ్ కారుకు ముందు వైపున అధిక క్రోమ్ పూత పూయబడిన ఫ్రంట్ గ్రిల్ మరియు వైడర్ డిజైన్, స్పోర్టివ్ డిజైన్ స్పూర్తితో రూపొందించిన బంపర్‌తో దీని ముందు భాగాన్ని అలంకరించారు.

ఇంటీరియర్
హోండా 2016 అమేజ్ కారులోని ఇంటీరియర్‌లో సౌకర్యవంతమైన ఫీచర్లు కోసం పెద్ద పీట వేసినట్లు తెలిసింది.

ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
మునుపటి అమేజ్ కారులా కాకుండా ఇందులో సరికొత్త తాకే తెర వ్యవస్థ గల అప్ ఫ్రంట్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కల్పించారు. దీనికి తోడు నూతన శైలిలో తయారు చేసిన డ్యాష్ బోర్డ్ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు.

ఇంజన్ వివరాలు
అయితే ఇంజన్‌లో ఎటువంటి మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు. మునుపటి అమేజ్‌లోని 1.52-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌తో పాటు ఆప్షనల్‌గా సిఎన్‌జి వేరియంట్ ఈ 2016 అమేజ్ కారులో అందివ్వనున్నారు.

ట్రాన్స్‌మిషన్
2016 అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారులో లభ్యమయ్యే ప్రతి ఇంజన్ వేరియంట్ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందివ్వనున్నారు.

హోండా మోటార్స్ వారు ఈ 2016 అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారులో భద్రత పరంగా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎయిర్ బ్యాగులను అందించారు. బేస్ వేరియంట్లలో ఆప్షనల్‍గా కూడా వీటి అందుబాటులోకి తీసుకురానున్నారు.

హోండా మోటార్స్ వారు అమేజ్ సెడాన్ కారు ద్వారా కోల్పోయిన అమ్మకాలను తిరిగి ఈ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ ద్వారా తిరిగి చేపట్టాలని భావిస్తున్నారు.

హోండా మోటార్స్ వచ్చే నెలలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు, మరిన్ని అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

2016 హోండా అమేజ్

2016 హోండా అమేజ్

2016 హోండా అమేజ్

- టాప్-10 జాబితాలో రాజ్యమేలుతున్న మారుతి సుజుకి
- క్రొత్త పేరుతో వచ్చిన టాటా జికా, మీకు తెలుసా ?


Click it and Unblock the Notifications








