2 లక్షల అమ్మకాల మైలు రాయిని దాటిన హోండా అమేజ్
హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అతి ముఖ్య మైలురాయిని చేధించింది. జపాన్‌కు చెందిన హోండా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన అమేజ్ కాంపాక్ట్ సెడాన్ రెండు లక్షల అమ్మకాలను జరిపింది. మొదటి సారిగా డీజల్ అమేజ్ కాంపాక్ట్ సెడాన్ 2013 లో దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యింది.
ఎప్పటికప్పుడు నూతనంగా కనిపించడానికి హోండా మోటార్స్ దీనిని రీఫ్రెష్‌డ్ డిజైన్‌లో అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో హోండా దీనిని ఫేస్‌లిఫ్ట్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. హోండా అమేజ్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

హోండా అమేజ్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించును. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 87 బిహెచ్‌పి పవర్ మరియు 109 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు. ఇది లీటర్‌కు 17.8 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

హోండా అమేజ్‌లోని మరొక ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ ఇంజన్. ఇది సుమారుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ 1.5 లీటర్ ఇంజన్‌కు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను మాత్రమే అనుసంధానం చేశారు. ఇది లీటర్‌కు సుమారుగా 25.8 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

దీని అమ్మకాలు గురించి హోండా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేస్వర్ సేన్ మాట్లాడుతూ, " హోండా అమేజ్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి దానికదే ప్రత్యేకతను సంతరించుకుంది. ఆ కారణం చేతనే కేవలం మూడు సంవత్సరాల్లోనే 2 లక్షల అమేజ్ కార్లు అమ్ముడుపోయాయని తెలిపాడు".

హోండా వారి అమేజ్ పెద్ద మరియు చిన్న నగరాలకు ఎంతో బాగా నప్పుతుంది. కారణం ఇందులోని అందించిన శక్తివంతమైన ఇంజన్ మరియు ఫీచర్లు.

హోండా అమేజ్ మన్నిక, నాణ్యత మరియు విశ్వసనీయమైన పనితీరు దీని విజయానికి కారణం అని కూడా వెల్లడించారు.

హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్న బాధితుడు
ఇండియన్ మార్కెట్లోకి ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్


Click it and Unblock the Notifications








