హోండా బిఆర్-వి గురించి విడుదలైన ఐదు ముఖ్యమైన విషయాలు

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా దేశీయ మార్కెట్లోకి మే 5, 2016 న ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని అందుబాటులోకి తీసుకురానుంది. విభిన్న ఆప్షన్లతో దేశీయ ఎస్‌యువి విపణిలోకి రానున్న బిఆర్‌-వి గురించి ఐదు ముఖ్యమైన విషయాలు క్రింది కథనంలో....

 1. బిఆర్-వి 7-సీటర్

1. బిఆర్-వి 7-సీటర్

హోండా ఎస్‌యువి సెగ్మెంట్లో తమ సరికొత్త బిఆర్-వి ద్వారా సునామిని సృష్టించనుంది. ముఖ్యంగా ఇందులో హోండా ఏడు సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకువస్తోంది.

 హోండా బిఆర్-వి గురించి ఐదు ముఖ్యమైన విషయాలు

ఎస్‌యువి మార్కెట్లో అగ్ర భాగాన ఉన్న రెనో డస్టర్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఎస్‌యువి లకు నేరుగా బిఆర్-వి తన సీటింగ్ కెపాసిటి ఫీచర్‌తో పోటీని సృష్టించనుంది.

2. ఇది ఒక ఎమ్‌పివి మరియు ఎస్‌యువి

2. ఇది ఒక ఎమ్‌పివి మరియు ఎస్‌యువి

హోండా మోటార్స్ ఈ బిఆర్-వి ని మొబిలియో, బ్రియో మరియు అమేజ్ కార్లను సృష్టించిన ఫ్లాట్ మీద అభివృద్ది చేసింది. ముఖ్యంగా ఈ మూడు కార్లు ఎక్కువ ఇంటీరియర్ సామర్థ్యంతో ఉన్నాయి. అచ్చంలో వీటిలోలానే బిఆర్-వి లో ఎక్కువ విశాలమైన ఇంటీరియర్‌తో పాటు ఏడు సీట్ల లేయట్‌ను అభివృద్ది చేసింది.

 హోండా బిఆర్-వి గురించి ఐదు ముఖ్యమైన విషయాలు

సాధారణంగా ఏడు సీట్ల సామర్థ్యం ఉన్న వాహనాలను ఎమ్‌పివిలు గా గుర్తిస్తాము. అయితే బిఆర్-వి కనిపించే ఎత్తైన తీరు మనకు ఎమ్‌పివిగా కన్నా ఎస్‌యువిగానే ముద్రవేయించుకుంది.

 3. బిఆర్-వి పనితీరు

3. బిఆర్-వి పనితీరు

జపాన్ ఆధారిత సంస్థ హోండా ఈ బిఆర్-విలో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఆప్షన్లలో అందించారు. అయితే ఈ ఇంజన్ ఆప్షన్లను మనం మొబిలియో వాహనంలో గుర్తించవచ్చు.

 హోండా బిఆర్-వి గురించి ఐదు ముఖ్యమైన విషయాలు

ఇందులో వినియోగించిన ఇంజన్లకు ఎస్‌యువి తరహాలో కొంచెం మార్పులు చేసి పెట్రోల్ 118 బిహెచ్‌పి మరియు డీజల్ ఇంజన్ 99 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయగలిగాయి. ఇందులో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు అందిస్తున్నారు. అయితే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పెట్రోల్ వేరియంట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

04. హోండా బిఆర్-వి లోని భద్రత ప్రమాణాలు

04. హోండా బిఆర్-వి లోని భద్రత ప్రమాణాలు

భారత్‌తో పాటు ఆసియా ఆగ్నేయ దేశాలు దీనికి నిర్వహించిన భద్రత పరీక్షలలో 5-స్టార్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఇలాంటి అరుదైన రేటింగ్ పొందడానికి హోండా మోటార్స్ ఈ బిఆర్-వి లో భారీ సేఫ్టీ ఫీచర్లను కల్పించారు.

హోండా బిర్‌-వి లోని భద్రత ఫీచర్లు

హోండా బిర్‌-వి లోని భద్రత ఫీచర్లు

  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్
  • ఎయిర్ బ్యాగులు
  • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
  • హిల్ స్టార్ట్ అసిస్ట్
  • హోండా మోటార్స్ ఈ బిఆర్-వి కి గల పోటీదారులు అందించిన ఫీచర్ల కన్నా మరిన్ని సేఫ్టీ ఫీచర్లను ఇందులో అందించింది.
  • హోండా బిఆర్-వి ధర మరియు పోటీ

    హోండా బిఆర్-వి ధర మరియు పోటీ

    హోండా మోటార్స్ అన్ని కోణాలలో పరిశీలించి ఈ బిర్-వి కాంపాక్ట్ ఎస్‌యువి వాహనాన్ని సరైన ధరకు మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీన ధర సుమారుగా 10 లక్షల నుండి 12 లక్షల మధ్య ఉండే విధంగా విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండోనేషియాలో విడుదలైన దీని ధర మన ఇండియన్ రుపాయల్లో 11.5 లక్షలుగా ఉంది.

    పోటీ

    పోటీ

    ఎస్‌యువి సెగ్మెంట్లో లీడర్‌గా ఉన్న హ్యుందాయ్ వారి క్రెటా మరియు రెనో డస్టర్ వాహనాలకు ఇది మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వనుంది. ఎక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న ఈ బిఆర్-వి అంచనాలు మించి ఫలితాలు సాధిస్తుందని మా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం....? ఏదైనా సరే మాతో పంచుకోండి.

    మరిన్నికథనాల కోసం.......

    మనం చెల్లించే సొమ్ముకు సరైన విలువ చేసే ఇండియన్ కార్లు

    డిస్కౌంట్లలో లభ్యమవుతున్న 11 కార్లు: ఎన్నడూ లేని విధంగా 2 లక్షల వరకు ఆఫర్లు

    మూడు స్టార్ల భద్రత రేటింగ్‌తో అన్నింటికన్నా ముందున్న మారుతి బాలెనొ

    మరిన్నికథనాల కోసం.......

    విశ్వపు అతి పెద్ద విమానం ఎయిర్‌బస్ ఎ380 గురించి ఆసక్తికర విషయాలు

    ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2016, 13:54 [IST]
English summary
5 Things Revealed About Honda's Upcoming SUV For India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+