ఇండియన్ వెబ్‌సైట్ మీద హడావిడి చేస్తున్న హోండా బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువి

By Anil

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయరీ సంస్థ హోండా మోటార్స్ రెండు వారాల క్రితం జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించింది. అయితే దీనిని అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో అందుబాటులోకి తీసుకురానుంది. అయితే దేశీయంగా అమ్మకాలకు అతి త్వరలో అందుబాటులోకి రానున్న బిఆర్-వి ఎస్‌యువి పేరు మీద మైక్రో‌సైట్‌ను ప్రారంభించింది.

హోండా బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువి


హోండా మోటార్స్ బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువి పేరు మీద ప్రారంభించిన అంతర్జాల వేదిక మీద ఇది లభించు రంగులను తెలిపింది.

  • ఆర్చిడ్ వైట్ పియర్ల్
  • కార్నిలియన్ రెడ్ పియర్ల్
  • గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్
  • ఆల్‌బాస్టర్ సిల్వర్ మెటాలిక్
  • టఫ్ఫేటా వైట్
  • అర్బన్ టైటానియమ్ మెటాలిక్


హోండా బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువిలోని సాంకేతిక వివరాలు:

బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లలో అందుబాటులో ఉంది. ఇవి రెండు కూడా ఆప్షనల్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
Also Read: 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడిన మరిన్ని కార్ల గురించి తెలుసుకోండి.
బిఆర్-వి ఎస్‌యువి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో మరియు హ్యుందాయ్ క్రెటా వంటి ఎస్‌యువిలకు గట్టి పోటిని ఇవ్వనుంది. ఇది మార్కెట్లోకి విడుదల అయితే ధర దాదాపుగా రూ. 9.5 లక్షల నుండి ప్రారంభం కానుంది (అందాసుగా). హోండా మోటార్స్ వారు దీనిని ఈ ఏడాది మలిసగంలో మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, February 22, 2016, 16:32 [IST]
English summary
Honda BR-V Compact SUV Showcased On Indian Website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+