హోండా బిఆర్-వి వర్సెస్ హ్యుందాయ్ క్రెటా

By Anil

ఒకప్పుడు ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్లో కారు అనే పదం మాత్రమే ఉండేది. అయితే కార్లు డిజైన్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా సెడాన్, కాంపాక్ట్ సెడాన్, హ్యాచ్‌బ్యాక్ ఎస్‌యువి అనే విభజనం క్రింది రకరకాల ఉత్పత్తుల తారల్లాగా మార్కెట్లో వెలుగుతూ ఉన్నాయి. హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్ల తరువాత ఇండియన్ మార్కెట్లో ఎస్‌యుల ప్రాబల్యం బాగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాదిలో విడుదల చేసిన క్రెటా రికార్డులను తిరగరాసే విధంగా అమ్మకాలు చేపట్టింది. అయితే దీని మీదకు పోటిగా హోండా వారి బిఆర్‌-వి ఎస్‌యువి మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని దెబ్బతో ఎస్‌యువి మార్కెట్లో కూడా సందడి మొదలైందని చెప్పవచ్చు.
Also Read: నిన్న కాక మొన్నవచ్చింది మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ కారును వెనక్కి నెట్టింది.
అందుకోసం పాఠకుల కోసం ఈ రెండింటి మధ్య గల తేడాలను క్రింది కథనం ద్వారా పోల్చడం జరిగింది. మరిన్ని వివరాల క్రింది
స్లైడర్లలో.....

 ధర వివరాలు

ధర వివరాలు

  • హ్యుందాయ్ క్రెటా ధర రూ. 9.74 లక్షలు
  • హోండా బిఆర్‌-వి ధర దాదాపుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు (ఇంకా విడుదల కాలేదు, అందాసుగా మాత్రమే)
  • గమనిక రెండు ధరలు కూడా అందాసుగా ఆన్-రోడ్ ఢిల్లీగా ఉన్నాయి.

    హోండా బిఆర్‌-వి డిజైన్

    హోండా బిఆర్‌-వి డిజైన్

    హోండా వారు తమ బ్రియో మరియు మొబిలీయో కార్లను అభివృద్ది చేసిన ఫ్లాట్ ఫామ్ మీదనే అభివృద్ది చేశారు. దీని ముందు వైపు డిజైన్‌ను చూడగానే ఎస్‌యువిను గుర్తుకు తెచ్చే తరహాలో డిజైన్ చేశారు. మరియు ముందు వైపున పదునైన చూపుల తరహాలో కండలు తిరిగిన డీకాల్ కలిగిన డిజైన్‌ను అందించారు.

     క్రెటా డిజైన్

    క్రెటా డిజైన్

    సౌత్ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఫ్లూయిడిక్ డిజైన్ ఆధారంతో క్రెటా ఎస్‌యువిని అభివృద్ది చేశారు. కొంత అయితే దీనిని ఎలైట్ ఐ20 నుండి అభివృద్ది చేశారని తెలిపారు. ఏదైతేనేం చక్కటి డిజైన్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

    బిఆర్-వి ఇంజన్ వివరాలు

    బిఆర్-వి ఇంజన్ వివరాలు

    హోండా మోటార్స్ వారు ఎప్పటిలాగే తమ సిటి కారులోని రెండు ఇంజన్లను ఇందులో అందించారు. అవి

    • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్
    • 1.5-లీటర్ డీజల్ ఇంజన్
    • బిఆర్‌-వి పవర్ మరియు టార్క్

      బిఆర్‌-వి పవర్ మరియు టార్క్

      ఇందులో గల 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ దాదాపుగా 117 బిహెచ్‌పి పవర్ మరియు 145 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో గల 1.5-లీటర్ డీజల్ ఇంజన్ సుమారుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

      బిఆర్‌-వి ట్రాన్స్‌మిషన్ వివరాలు

      బిఆర్‌-వి ట్రాన్స్‌మిషన్ వివరాలు

      ప్రస్తుతానికి హోండా మోటార్స్ తమ బిఆర్-వి లోని రెండు ఇంజన్లలో కూడా మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను అందిస్తోంది. అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను కూడా అందించే అవకాశాలు ఉన్నాయి.

       క్రెటా ఇంజన్ వివరాలు

      క్రెటా ఇంజన్ వివరాలు

      హ్యుందాయ్ వారు తమ క్రెటా ఎస్‌యువిలో ఒక పెట్రోల్ మరియు రెండు డీజల్ ఇంజన్లను అందించారు. అవి

      • 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్
      • 1.4-లీటర్ డీజల్ ఇంజన్
      • 1.6-లీటర్ డీజల్ ఇంజన్
      • పవర్ మరియు టార్క్ వివరాలు

        పవర్ మరియు టార్క్ వివరాలు

        • 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 122 బిహెచ్‌పి పవర్ మరియు 154 ఎన్ఎమ్ టార్క్
        • 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 89 బిహెచ్‌పి పవర్ మరియు 224 ఎన్ఎమ్ టార్క్
        • 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 126 బిహెచ్‌పి పవర్ మరియు 265 ఎన్ఎమ్ గరిష్ట్ టార్క్‌ను ఉత్పత్తి చేయును.
        •  క్రెటా ట్రాన్స్‌మిషన్ వివరాలు

          క్రెటా ట్రాన్స్‌మిషన్ వివరాలు

          క్రెటా లోని డీజల్ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు.

           క్రెటా మైలేజ్ వివరాలు

          క్రెటా మైలేజ్ వివరాలు

          • 1.6-పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 15.29 కిలోమీటర్లు
          • 1.4-లీటర్ డీజల్ ఇంజన్ లీటర్‌కు 21.38 కిలోమీటర్లు
          • 1.6-లీటర్ డీజల్ ఇంజన్ 19.67 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలవు.
          • బిఆర్‌-వి ఎస్‌యువిలోని ఫీచర్లు

            బిఆర్‌-వి ఎస్‌యువిలోని ఫీచర్లు

            బిఆర్‌-విలో మూడు వరుసలు గల సీటింగ్ సామర్థ్యం మరియు వెనుక వరుసలలోని వారికి టాప్ మౌంటెడ్ ఎయిర్ వెంట్ ద్వారా ఎసి అందుతుంది. 16-అంగుళాల చక్రాలు, పవర్ విండోస్, రియర్ పార్కింగ్ కెమెరా, తాకే తెర గల ఆడియో మరియు వీడియో న్యావిగేషన్ సిస్టమ్ కలదు, కీలెస్ ఎంట్రీ మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలవు.

            క్రెటా ఎస్‌యువిలోని ఫీచర్లు

            క్రెటా ఎస్‌యువిలోని ఫీచర్లు

            ఇందులో ఆడియో మరియు వీడియో న్యావిగేషన్ గల తాకే తెర, స్మార్ట్ కీ గల పుష్ బటన్ స్టార్ట్, 17-అంగుళాల చక్రాలు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, స్టీరింగ్ ద్వారా నియంత్రించే సాంకేతికతలు మరియు ఎల్‌‌ఇడి పొజిషనింగ్ ల్యాంప్స్ కలవు.

             బిఆర్‌-వి లోని భద్రత ఫీచర్లు

            బిఆర్‌-వి లోని భద్రత ఫీచర్లు

            • ఎయిర్ బ్యాగులు
            • యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్
            • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
            • మరియు ఇతర ఫీచర్లతో ఇది రానుంది.
            •  క్రెటా లోని భద్రత పరమైన ఫీచర్లు

              క్రెటా లోని భద్రత పరమైన ఫీచర్లు

              • సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులు
              • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
              • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్
              • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
              • హిల్ స్టార్ట్ అసిస్ట్
              • వెహికల్ స్టెహబిలిటీ మెనేజ్‌మెంట్
              • తీర్పు: హ్యుందాయ్ క్రెటా

                తీర్పు: హ్యుందాయ్ క్రెటా

                ప్రస్తుతం ఇండియన్ ఎస్‌యు మార్కెట్లో క్రెటా మంచి అమ్మకాలను సాధిస్తోంది. కారణం డిజైన్ పరంగా అత్భుతంగా ఉంటుంది, క్రెటా ధర, ఫీచర్లు, డిజైన్ అన్ని కూడా సరైన విలువతో ఉంటాయి. మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గలగేర్ బాక్స్‌ను గల మొదటి డీజల్ ఎస్‌యువి ఇది.ఈ గేర్ బాక్స్‌ వలన సిటీ రోడ్ల మీద చక్కగా దీనిని నడుపవచ్చు.

                హోండా బిఆర్‌-వి

                హోండా బిఆర్‌-వి

                హోండా బిఆర్‌-వి ఎంతో నమ్మదగిన ఎస్‌యువి మరియు హోండా వారు దీనిని సరైన ధరతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోండా బిఆర్‌-వి క్రెటా కారును అమ్మకాల పరంగా వెనక్కి నెట్టగలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అన్నింటికన్నా ఇందులో ఏడు మంది వరకు ప్రయాణించవచ్చు క్రెటాలో అయితే ఐదు మాత్రమే ప్రయాణించగలరు. మరిన్ని వివరాలకు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

                హోండా బిఆర్-వి వర్సెస్ హ్యుందాయ్ క్రెటా
                • ఇండియన్ మార్కెట్లో వరుసగా విడుదల కానున్న 20 కార్లు
                • ఏకే-47 తో కాల్పులు జరిపినా కూడా చెక్కుచెదరని కారు

Article Published On: Saturday, February 20, 2016, 15:28 [IST]
English summary
Honda BR-V vs Hyundai Creta Comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+