హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీ ఖరారు

By Anil

హోండా మోటార్స్‌కు చెందిన లిటిల్ హ్యాచ్‌బ్యాక్ బ్రియోను ఫేస్‌లిఫ్ట్ రూపంలో అందుబాటులోకి రానుంది. దసరా ఉత్సవాలకు సిద్దంగా అక్టోబర్ 4, 2016 న దేశవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. మహిళలు ఎక్కువ ఎంచుకుంటున్న ఈ బ్రియో హ్యాచ్‌బ్యాక్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలోకి విడుదల చేయనుంది.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

ఇండియాలో కాకుండా బయట మార్కెట్లోకి అప్‌డేటెడ్ వర్షన్‌లో హోండా విడుదల చేసిన బ్రియో రూపంలోనే ఈ ఫేస్‌లిఫ్టెడ్ బ్రియో ఉంది. కాంపాక్ట్ సెడాన్‌ అమేజ్‌లో చేసిన మార్పులు ఇందులో కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

హోండా బ్రియోలో ముందు వైపున అందించిన యాంగులర్ బంపర్ మరియు కోణీయ డిజైన్ శైలి దీనిని మరింత స్పోర్టివ్‌గా ఉండేట్లు చేసింది.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

ఇంటీరియర్ పరంగా హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌లోని మరియు హోండా బిఆర్-విలోని అదే డ్యాష్‌బోర్డ్ శైలిలో ఇందులోని డ్యాష్‌బోర్డ్‌ని అందించారు. మరియు ఆ రెండింటిలో వినియోగించిన అదే మ్యూజిక్ సిస్టమ్‌ను ఫేస్‌లిఫ్ట్ బ్రియోలో పరిచయం చేసినట్లు స్పష్టం అవుతోంది.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

హోండా 2011 లో మొదటి సారిగా బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం గల ఐవిటిఇసి పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

తాజాగా అప్ డేటెడ్ వేరియంట్లో వచ్చిన అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ని ఆప్షనల్‌గా ఎంచుకునేందుకు సివిటి గేర్‌బాక్స్‌ను పరిచయం చేసారు. ఇప్పుడు ఈ బ్రియోలో కూడా సివిటి గేర్‌బాక్స్‌ను ఆప్షనల్‌గా అందించే అవకాశాలు ఉన్నాయి.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

ధర విషయానికి వస్తే కొన్ని అదనపు ఫీచర్లతో ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల కానున్న హోండా బ్రియో ధరలు మునుపటి ధరలకు సమానంగా లేదా స్వల్ప వ్యత్యాసంతో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 హోండా బ్రియో ఫేస్‌లిఫ్ట్ విడుదల వివరాలు

  • ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు
  • 2.82 లక్షల వరకు తగ్గిన ఫోర్డ్ ఎండీవర్ ధర: త్వరపడండి
  • మహీంద్రా స్కార్పియో ఇంటెల్లీ హైబ్రిడ్ విడుదల: ధర రూ. 9.35 లక్షలు

More from DriveSpark

Article Published On: Wednesday, September 28, 2016, 18:25 [IST]
English summary
Read In Telugu: Honda Brio Facelift Launch Date Revealed — Restyled To Love You Back!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+