అప్‌డేటెడ్ వేరియంట్లో హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్
ఇండియన్ మార్కెట్లో ఉన్న కార్లలో భారతీయ మహిళలు ఎక్కువగా ఎంచుకుంటున్న వాటిలో హోండా బ్రియో హ్యాచ్‌బ్యాక్ ఒకటి. హోండా మోటార్స్ బ్రియో కు కావాల్సిన అప్‌డేట్స్‌ను చేయనున్నారు. ఇది వరకే జరిగిన 2016 ఇండోనేషియా మోటార్ షోలో అప్‌డేటెడ్ బ్రియోను ప్రదర్శించారు. అయితే దీనిని దేశీయంగా సెప్టెంబర్ 2016 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు.

దేశీయంగా అప్‌డేట్స్‌తో అందుబాటులోకి రానున్న 2016 హోండా బ్రియో లో స్వల్ప కాస్మొటిక్ మార్పులు చోటుచేసుకోనున్నాయి.

ఎక్ట్సీరియర్ డిజైన్‍లో హోండా వారి తాజా అమేజ్‌లోని స్టైలింగ్ లక్షణాలను జోడించనున్నారు.

ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్‌లో హోండా అమేజ్ సెడాన్‌లోని డ్యాష్ బోర్డ్‌ను ప్రీమియమ్ లుక్‌తో అందివ్వనున్నారు.

సాంకేతిక మార్పులకు కూడా 2016 బ్రియో గురవుతోంది. ఇందులో 1.2-లీటర్ ఐ-విటిసి పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

2016 బ్రియోలోని శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్ సుమారుగా 90బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి (ఆటోమేటిక్) ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

హోండా మోటార్స్ ఈ 2016 బ్రియో హ్యాచ్‌బ్యాక్‌ను అత్యంత శక్తివంతమైన ధరతో అందిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ. 5 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.

హోండా ఈ బ్రియోను కొత్త ధరతో అందుబాటులోకి తీసుకువస్తే హ్యుందాయ్ గ్రాండ్, షెవర్లే బీట్ మరియు స్విఫ్ట్‌లకు కాస్త పోటీని ఎక్కువ కానుంది.

విమానాలు, నౌకల్ని మింగుతున్న బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనా ?

- మూత్రం నుండి కాఫీ చేసుకున్నాం: వ్యోమగాముల అనుభవాలు


Click it and Unblock the Notifications








