10,000 బుకింగ్‌ల మైలు రాయిని దాటిన హోండా బిఆర్-వి
హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి మే 5, 2016 న బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేసింది. విడుదల చేసిన సమయం నుండి ఇప్పటి వరకు సుమారుగా 10,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
హోండా కార్స్ ఇండియా సిఇవో మరియు ప్రెసిడెంట్ యోచిరో ఉయెన్ మాట్లాడుతూ "హోండా బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోని యువ మరియు మధ్య వయస్కుల వారిని దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి తెచ్చాము, దీని వలనే అతి తక్కువ కాలంలోనే వినియోగదారుల నుండి విశేష ప్రజాదరణను పొందాము" అని తెలిపాడు. 10,000 మందికి పైగా ఎంచుకున్న హోండా బిఆర్-వి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కోసం....

మంచి డిజైన్ మరియు సౌకర్యవంతంగా ఉండే హోండా బిఆర్-వి లో ఏడు మంది కూర్చునే విధంగా రూపొందించారు. తద్వారా ఫ్యామిలీ మరియు యువ వినియోగదారులన ఎంతగానో ఆకర్షించింది.

మార్కెట్లో ఏ తయారీ సంస్థ కూడా ఇవ్వని విధంగా మూడు సంవత్సరాల వరకు లేదా అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వరకు వారంటీ ప్రకటించారు.

ఒక 7 సీటర్ ఎస్‌యువి ఇండియన్ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందుబాటులోకి రావడం దీనికి కలిసొచ్చింది అని చెప్పవచ్చు.

హోండా మోటార్స్ ఈ 7 సీటర్ బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ఆటోమేటిక్ వేరియంట్లలో అందించింది, మరియు ఈ ఆటోమేటిక్ వేరియంట్లకు పెడల్ షిఫ్టర్లను కూడా కల్పించారు. అంతే కాకుండా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగులను అందించారు.

హోండా బిఆర్-వి ఇంజన్ ఆప్షన్లు
హోండా మోటార్స్ ఈ బిఆర్-వి కాంపాక్ట్ ఎస్‌యువిలో 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ను అందించింది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ సుమారుగా 117 బిహెచ్‌పి పవర్ మరియు 145 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అదే విధంగా డీజల్ ఇంజన్ సుమారుగా 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా బిఆర్-వి మైలేజ్ వివరాలు
- హోండా బిఆర్-వి పెట్రోల్ (మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్) 15.4 కిమీలు
- హోండా బిఆర్-వి పెట్రోల్ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) 16 కిమీలు హోండా బిఆర్-వి డీజల్ 21.9 కిమీలు మైలేజ్ ఇవ్వగలవు.
- కార్నేలియన్ రెడ్ పియర్ల్
- అర్బన్ టైటానియమ్
- ఆర్చిడ్ వైట్ పియర్ల్
- టఫ్పేటా వైట్
- గోల్డెన్ బ్రౌన్
- అల్బాస్టర్ సిల్వర్
- బిఆర్-వి పెట్రోల్ ఎంట్రీలెవర్ వేరియంట్ ధర రూ. 10.24 లక్షలు
- బిఆర్-వి డీజల్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు రెండు ధరలు ఆన్ రోడ్ (హైదరాబాద్)గా ఉన్నాయి.

హోండా బిఆర్-వి లభించు రంగులు

హోండా బిఆర్-వి ధరలు
హోండా బిఆర్-వి ఎస్‌యువి ధరలు 8.75 లక్షలు నుండి 12.90 లక్షలుగా ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి

హోండా బిఆర్-వి కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి


Click it and Unblock the Notifications








