ఆటో ఎక్స్ పోలో బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించిన హోండా మోటార్స్

By Anil

హోండా మోటార్స్ 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో బిఆర్‌-వి కాంపాక్ట్ ఎస్‌యువిని ప్రదర్శించింది. మూడు వరుసలు గల సీట్లలో ఏడు మంది సుఖంగా ప్రయాణించే వీలున్న ఈ బిఆర్‌-వి ఎస్‌యువి రాకతో దేశీయంగా ఉన్న ఎస్‌యువిలలో తీవ్ర పోటి నెలకొంది.

హోండా బిఆర్-వి


హోండా బిఆర్‌-వి సాంకేతిక వివరాలు:
హోండా మోటార్స్ ఈ బిఆర్-వి ఎస్‌యువి చక్రాలను మొబిలియో ఎమ్‌పివి లోని 1.5-లీటర్ ఇంజన్ ద్వారా నడపాలనే ఆలోచనలో ఉన్నట్లు ఉంది.

  • ఇంజన్: 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్
  • పవర్: డీజల్ ఇంజన్ 145 BHP @4600RPM మరియు పెట్రోల్ ఇంజన్ 117BHP @600RPM
  • టార్క్: డీజల్ ఇంజన్ 98NM @3600RPM మరియు 200NM@1750RPM

హోండా మోటార్స్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ రకాలను కూడా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్‌లలో అందించనున్నారు.

డిజైన్ మరియు ఫీచర్లు గురించి:
హోండా వారి బిఆర్-వి ఎస్‌యువి డిజైన్ పరంగా ముందు వైపు అత్భుతంగా రూపొందించారు. డిజైన్‌లో కూడా కొన్ని ఫీచర్లు కల్పించారు. రెక్టాగ్యులర్ ఆకారంలో గల హెడ్ లైట్లు, ముందు వైపు ఫ్రంట్ గ్రిల్ మధ్య బాగం నుండి గాలి లోపలికి వెళ్లడానికి తయారు చేసిన డిజైన్ ఎంతో బాగుంది.

బిఆర్‌-వి వెనుకవైపున గల టెయిల్ ల్యాంప్స్ యాంగులర్ ఆకారంలో తయారు చేశారు. ఇక ముందు మరియు వెనుకవైపున గల స్కిడ్ ప్లేట్ డిజైన్, రూఫ్ రెయిల్ మరియు క్లాడింగ్ వంటి పరికరాల డిజైన్ పర్వాలేదనిపిస్తాయి.
AUTO EXPO NEWS: మారుతి సుజుకి వితారా బ్రిజా తో ఆరంభమైన వాహన ప్రదర్శన మరిన్ని వివరాలకు
పోటి మరియు అందుబాటులోకి:
మారుతి సుజుకి వారు ప్రదర్శించిన వితారా బ్రిజా, హ్యుందాయ్ క్రెటా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఎస్‌యువిలకు పోటిగా నిలవనుంది. ఇది హోండా షోరూమ్‌లకు మరియు భారతీయ రోడ్ల మీదకు ఈ ఏడాది చివరికల్లా రానుంది.
హోండా బిఆర్‌-వి ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలు ఆటో ఎక్స్ పో నుండి:

More from DriveSpark

Article Published On: Friday, February 5, 2016, 13:11 [IST]
English summary
2016 Auto Expo: Honda BRV Makes India Debut, Joins Compact SUV Fight
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+