కొత్త ఏడాది నుండి మరింత దుబారి కానున్న హోండా కార్ల ధరలు

నూతన సంవత్సరం నుండి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే పలు వాహన తయారీ సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మోటార్స్ కూడా అదే బాటలోకి చేరింది.

By Anil

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల మీద ధరల పెంపును ప్రకటించింది. హోండా మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం తమ ఉత్పత్తుల మీద పెరిగిన ధరలు 2017 జనవరి నుండి అమల్లోకి రానున్నాయి. నూతన ఏడాది వాహన ఉత్పత్తుల ధరల పెంపుకు వేదికయ్యిందని ఇప్పటికే చాలా వరకు వాహన తయారీ సంస్థలు ధరల పెంపు ప్రకటనతో స్పష్టం చేశాయి.

పెరిగిన హోండా కార్ల ధరలు

పెట్టుబడి వ్యయాలు అధికమవ్వడం మరియు అంతర్జాతీయ మార్కెట్లోకి ఇండియన్ కరెన్సీ మారకం రేటు పడిపోవం వంటి ముఖ్యమైన కారణాలను పరిగణసలోకి తీసుకుని ధరల పెంపును ప్రకటించినట్లు హోండా తెలిపింది.

పెరిగిన హోండా కార్ల ధరలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హోండా కార్స్ ఇండియా లైనప్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల ధరలను ప్రస్తుతం ధరలో మూడు శాతం వరకు పెంపుకు గురైనట్లు హోండా స్పష్టం చేసింది. ధరల పెంపు నిర్ణయంతో ధరల సవరణ అనంతరం నూతన ధరలు 2017 జనవరి నుండి అమలు కానున్నాయి.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి యోఇచిరో యుఎన్ మాట్లాడుతూ, ముడి సరుకుల వ్యయాలు, పెట్టుబడి వ్యయాలు పెరగడం మరియు అంతర్జాతీయ విపణిలో రుపాయి మారకం అంశాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి మీద అధిక వ్యయపు ఒత్తిడిని తగ్గించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ధరల పెంపును చేపట్టినట్లు తెలిపాడు.

పెరిగిన హోండా కార్ల ధరలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అనేక కార్ల తయారీ సంస్థలు సంవత్సరాంతపు (ఇయర్ ఎండ్) ఆఫర్లను ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉన్నాయి. నూతనంగా తీసుకున్న ధరల పెంపు వచ్చే ఏడాది నుండి మాత్రమే వర్తిస్తుంది.

పెరిగిన హోండా కార్ల ధరలు

నల్ల ధనాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా భారత ప్రభుత్వం తీసుకున్న పాత రూ. 1,000 మరియు రూ. 5,00 నోట్ల రద్దు ప్రభావం హోండా కార్ల అమ్మకాల మీద స్పష్టంగా కనిపించింది. విక్రయాల్లో సుమారుగా 50 శాతం వరకు వృద్దిని కోల్పోయినట్లు జపాన్ కార్ల తయారీ సంస్థ పేర్కొంది.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా మోటార్స్ గత నవంబర్ 2016 లో మొత్తం 8,029 యూనిట్ల విక్రయాలు జరిపింది. అందులో 697 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. గత ఏడాది ఇదే నవంబర్ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే 14,712 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తానికి విక్రయాల్లో 45 శాతం వృద్దిని కోల్పోయింది హోండా ఇండియా.

పెరిగిన హోండా కార్ల ధరలు

ప్రస్తుతం హోండా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఎనిమిది ఉత్పత్తులను విక్రయిస్తోంది. అవి, బ్రియో హ్యాచ్‌బ్యాక్, జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్, సిటి సెడాన్, మొబీలియో ఎమ్‌పివి, బిఆర్-వి క్రాసోవర్ ఎస్‌యువి. మరియు హోండా సిఆర్-వి అదే విధంగా అకార్డ్ హైబ్రిడ్ లను కంప్లిట్లీ బిల్ట్ యూనిట్లుగా దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా మోటార్స్‌కు ఈ ఏడాది (2016) అత్యంత బిజీ సంవత్సరం అని చెప్పవచ్చు. కంపెనీ రెండు కొత్త మోడళ్లను - హోండా బిఆర్-వి మరియు అకార్డ్ హైబ్రిడ్ లను తమ లైనప్‌లోకి విడుదల చేసింది. అంతే కాకుండా బ్రియో మరియు అమేజ్ వేరియంట్లను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కూడా పరిచయం చేసింది.

పెరిగిన హోండా కార్ల ధరలు

అయితే హోండా మోటార్స్ వచ్చే ఏడాది తమ సిటి సెడాన్‌ను 2017 సిటిఫేస్‌లిఫ్టెడ్వెర్షన్‌గా మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమవుతోంది. సియాజ్ మరియు వెర్నాలకు పోటీగా బరిలోకి దిగుతున్న ఇందులో భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

పెరిగిన హోండా కార్ల ధరలు

హోండా మోటార్స్‌తో పాటు ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్, టయోటా, వోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ మరియు రెనో కూడా తమ ఉత్పత్తుల మీద ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి.

పెరిగిన హోండా కార్ల ధరలు
  • ఫోర్డ్ నుండి దేశీయ మార్కెట్లోకి కుగా కాంపాక్ట్ SUV
  • మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?
  • ఇండియాలో రోడ్డుకు ఎడమవైపు డ్రైవ్ చేయడం వెనకున్న సీక్రెట్స్

More from DriveSpark

Article Published On: Monday, December 19, 2016, 13:47 [IST]
English summary
Honda Cars India To Increase Prices; Effective January 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+