జూలై 25 న ప్రపంచ ప్రదర్శనకు రానున్న హోండా సిబిఆర్ 250ఆర్ఆర్
హోండా నుండి రానున్న సిబిఆర్ 250ఆర్ఆర్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. స్పోర్ట్స్ బైకుల ఫ్యాన్స్ మాత్రం దీని విడుదల ఎప్పుడా అన్నట్లుగా వేచి ఉన్నారు. సమాచార వర్గాల కథనం ప్రకారం దీనిని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సంస్థ జూలై 25, 2016 న అంతర్జాతీయ ప్రదర్శన చేయనుంది. దీనికి ఇండోనేషియాను వేదికగా చేసుకున్నట్లు తెలిసింది.
హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ బైకు ప్రదర్శన జరిగే వేడుకలకు ఇండోనేషియాలో కొన్ని వార్తా సంస్థలకు ఆహ్వానం కూడా లభించింది.

జపాన్ ఆధారిత ద్విచక్రవాహనాల తయారీ సంస్థ హోండా గత ఏడాది టోక్యో మోటార్ షోలో ప్రదర్శించిన లైట్ వెయిట్ సూపర్ స్పోర్ట్స్ కాన్సెప్ట్‌ను రూపొందించిన వేదిక మీద దీనిని అభివృద్ది చేసారు. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను అందివ్వనున్నారు.
పనితీరు మరియు ఇతర సాంకేతిక వివరాలు వెల్లడి కాకపోయినప్పటికీ ఇందులో రైడ్ బై వైర్ థ్రోటిల్ మరియు వివిధ రకాల డ్రైవింగ్ మోడ్‌లలో రానుంది. అంతే కాకుండా ఇందులో ఎల్‌ఇడి లైట్లు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మరియు ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ కలవు.
Also Read: 2016 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 టూ వీలర్లు
ఇది పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే యమహా ఆర్3 మరియు కవాసకి నింజా 300 వంటి బైకులకు పోటీగా నిలవునుంది. అయితే దీనిని ఇండియాకు పరిచయం చేస్తారా లేదా అనే విషయం స్పష్టం కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications