హోండా సిటి సెడాన్ ఆధారంతో రానున్న సిటి హ్యాచ్‌బ్యాక్
జపాన్‌కు చెందిన అతి పెద్ద కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్. తమ సిటి సెడాన్ ఆధారంతో సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారును రూపొందిస్తోంది. దీనిని ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సిటి ఆధారంతో తయారు చేస్తున్నారు.

ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ పేరు జీనియా గా ఉన్నట్లు తెలిసింది. చైనాకు చెందిన కొన్ని అంతర్జాల వేదికల మీద జీనియా హ్యాచ్‌బ్యాక్ ఫోటోలు లభించాయి.
సరికొత్త హోండా హ్యాచ్‌బ్యాక్‌లో సిటి సెడాన్ మరియు హోండా వారి ఇతర కార్ల డిజైన్ పోలికలను రంగరించి దీనిని రూపొందించినట్లు అవగతం అవుతుంది.
సిఎం చంద్రబాబు నాయుడు గురించి మీకు ఎంత వరకు తెలుసు ?
హోండా జీనియా ఫ్రంట్ గ్రిల్‌ను మాత్రం 2014 హోండా ప్రదర్శించిన ప్రాజెక్ట్ బి కాన్సెప్ట్‌లోనిది మరియు దీనికి ముందు వైపున వినియోగించిన హెడ్ లైట్లను హోండా సిటి నుండి సేకరించారు.
హోండా జీనియా హ్యాచ్‌బ్యాక్ వెనుక వైపున డిజైన్‌ను గమనించినట్లయితే అచ్చం సివిక్ కారులో ఉన్నట్లుగానే ఉంది. వెనుక వైపున ఉన్న విండ్ స్క్రీన్ మీద చిన్న పరిమాణంలో ఉన్న స్పాయిలర్ కలదు.
మారుతి సుజుకి'కి చెక్ పెట్టనున్న హ్యుందాయ్ వారి ఆరు అప్‌కమింగ్ కార్లు
చైనీయుల మార్కెట్లో ఉన్నట్లుగా తెలుస్తున్న జీనియా హ్యాచ్‌బ్యాక్‌లోని జీనియా అనే పదానికి అర్థం ఏంటనేది తెలియరాలేదు మరియు దీనిని హోండా దేశీయ మార్కెట్లోకి విడుదల చేస్తుందా లేదా అనే విషయం కూడా స్పష్టం కావాల్సి ఉంది.



Click it and Unblock the Notifications








