హోండా వారి 5-సీటర్ ఫ్యూయల్ సెల్ కారు, క్లారిటీ
హోండా మోటార్స్ వారు తమ సంస్థ నుండి ఫ్యూయల్ సెల్ కారును తీసుకువచ్చారు. ఐదు సీట్ల సామర్థ్యం గల జీరో ఎమిషన్ (ఉద్గార రహిత) కారును తీసుకువచ్చారు.
హోండా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ క్లారిటీ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

జపాన్ కు చెందిన హోండా మోటార్స్ మొదటి ఏడాదిలో 200 యూనిట్ల వరకు అమ్మాకాలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అయితే ఈ సంస్థ ప్రస్తుతం జపాన్‌లోని చాలా వరకు ప్రభుత్వ సంస్థలకు మరియు పర్యావరణ మంత్రులకు మరియు వ్యాపార వేత్తలకు వీటిని లీజుకు ఇస్తోంది.

ప్రస్తుతం జపాన్‌లో నెలకు ఒక్క క్లారిటీ కారు అద్దె విలువ 100,000 యెన్‌లు గా ఉంది. మన రుపాయల్లో దీని విలువ 58,961 లుగా ఉంది.

అంతే కాదండోయ్ హోండా మోటార్స్ వారు దీనిని అమెరికా కార్ల మార్కెట్లోకి అందివ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది.

హోండా సంస్థ ఈ క్లారిటి కారులో శుద్దమైన సూపర్ క్లీన్ హైడ్రోజన్ ఇంజన్ సెల్‌ను కల్పించారు.

ఇది ఇధనంగా హైడ్రోజన్ మరియు గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకుంటుంది.

హోండా వారి క్లారిటి కారు ఉద్గారంగా కేవలం నీటిని మాత్రమే విడుదల చేస్తుంది.

హోండా వారి క్లారిటి కారులోని ఇంధన ట్యాంకును ఒక్క సారి నింపితే దాదాపుగా 750 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. సెడాన్‌లలో ఇది ఎంతో ఉత్తమమైనది.

హోండా మోటార్స్ తమ క్లారిటి కారులో రివైజ్డ్ ఫ్యూయల్ సెల్‌ను అందించారు ఇది పరిమాణం పరంగా చిన్నగా ఉంటుంది.

- వేలానికి విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం
- టీవీఎస్ విక్టర్ మార్కెట్లోకి రీ ఎంట్రీ: ప్రారంభ ధర రూ. 51,600
- ఐఎన్‌ఎస్ మహదేయి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








